ప్రభుత్వ మందులపై పర్యవేక్షణ ఏది..?

MOHAN BABU
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలోని డీఎంహెచ్ఓ కార్యాలయాలు, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులు, కాలేజీల్లో 13 ఫార్మసీ సూపర్వైజర్ పోస్టులు గత నాలుగేళ్ల నుంచి భర్తీ చేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే మందులపై పర్యవేక్షణ సజావుగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరో జోన్లో ఆరుగురు ఫార్మాసిస్ట్   గ్రేడ్ -1 లుగా  2018 డిసెంబర్ లో పదోన్నతి పొందారు. ఇప్పటికే అదే కేడర్లో కొనసాగుతూ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2 ల పరిస్థితి మరి దయనీయంగా తయారైంది. ఇందులో కొంతమంది సర్వీస్ పదోన్నతి లేకుండా 31 ఏళ్లుగా ఒకే కేడర్లో కొనసాగుతుండడం గమనార్హం. ఫార్మసీ గ్రేడ్-1 లో ఉన్నవారిని ఫార్మసీ సూపర్వైజర్ లాగా నియమిస్తే ఏళ్ల తరబడి పనిచేస్తున్న గ్రేడ్ -2 లో ఉన్నవారికి పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే ఫార్మసిస్టులకు మెడికల్ స్టోర్లు, ఓపి ఫార్మసీ, ఇ - ఔషధీ, మెడిసిన్ సేకరణ, పర్యవేక్షణ బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు చాలా తక్కువగా సిబ్బంది ఉండడంతో పనిభారం పెరిగిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కొత్త మెడికల్ కాలేజీలో పూర్తిస్థాయి ఫార్మసీ గ్రేడ్ -1, గ్రేడ్ -2 తో పాటు ఫార్మసీ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో ఓపి, ఐ పి రోగుల సంఖ్య ఆధారంగా పోస్టుల సంఖ్య పెంచాలని, బస్తీ దవాఖానాలు, స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్లు, మలేరియా, లెప్రసి స్టోర్లు, డీఎంహెచ్ఓ స్టోర్లలో ఫార్మసీ యాక్ట్  1948 ప్రకారం ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులను మంజూరు చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు ఆ శాఖను ప్రక్షాళన చేస్తానని సీఎం కేసీఆర్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు పదేపదే ప్రకటించినప్పటికీ సమస్యలు స్వాగతం చెబుతూనే ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో చోటుచేసుకుంటున్న జాప్యం కాస్త ప్రజల్లో విశ్వాసం పెంచడం మాట ఏమోగానీ, ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: