దేశంలో కరోనా కాస్త తగ్గుముకం పట్టినట్టు కనిపించినా కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్టు నివేధికలు చెబుతున్నాయి. అయితే గతంతో కంటే భారత్ లో కరోనా తగ్గుముకం పట్టగా త్వరలోనే థర్డ్ వేవ్ రాబోతుందని నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఇండియాలో కరోనా డెల్టా-4 మ్యూటెంట్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా డెల్టా-4 మ్యూటెంట్ తోనే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని బయోటెక్నాలజీ విభాగం కేంద్ర ప్రభుత్వానికి నివేధికలో తెలిపింది .
ఇండియాలో ఉన్న మ్యూటెంట్ లను గుర్తించడానికి బయోటెక్నాలజీ విభాగం 90,115 నమూనాల జన్యుశ్రేణి పూర్తయ్యిందని...వాటిలో 62.9 శాతం నమూనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి తీవ్రమైన వేరియంట్ లను గుర్తించామని చెబుతున్నారు. కప్పా, డెల్టా,గామా,బీటా లాంటి వేరియంట్ లు కరోనా ఇన్ఫెక్షన్ ను పెంచే ప్రమాదం ఉందని వాటితో వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా దేశంలో సి.1.2 అనే వేరియంట్ తో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదని నివేధికలో స్పష్టంగా పేర్కొన్నారు .
ఇక ప్రస్తుతం పరీక్షిస్తున్న నమూనాల్లో ఎక్కవ శాతం డెల్టా-4 మ్యూటెంట్ లను ఎక్కువగా గుర్తిస్తున్నామని చెబుతున్నారు..దాంతో ఆ వేరియంట్ వల్లే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అంతే కాకుండా గత నెలలో కేరళలో 30 శాతం మందిలో అదే విధంగా మహరాష్ట్రలో 40శాతం మందిలో డెల్టా-4 వేరియంట్ కు సంబంధించిన కేసులనే గుర్తించామని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో డెల్టా-4 వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కరమైనదిగా గుర్తించింది. అంతే కాకుండా వైరస్ కు సంబంధించి కొత్త మ్యూటెంట్ లు అంటు వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు భావిస్తున్నారు .