తల్లి పాల కోసం తల్లడిల్లుతున్న పాపాయిలు..!

MOHAN BABU
రాష్ట్రంలో తల్లిపాలు అవసరమయ్యే శిశువుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. బిడ్డ పుట్టగానే తల్లి చనిపోవడం, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన శిశువుకు తల్లి దూరంగా ఉండటం, తల్లి బలహీనంగా ఉండి సరైన మోతాదులో పాలు  రాకపోవడం వంటి కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డకు తల్లిపాలు కరువవుతున్నాయి. కరుణ తర్వాత ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువ అయినట్టు గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నదని, ఇది అత్యంత ప్రమాదకరమైన డబ్ల్యూహెచ్ఓ సైతం ఇటీవల హెచ్చరించింది. ఈ సమస్యను అధిగమించాలంటే లేదంటే భావి భారత పౌరులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రభుత్వాలకు సూచించింది.

దీంతో తెలంగాణలో కొత్తగా మూడు మదర్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక్కో సెంటర్ ను రూ.34.45 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నీలోఫర్ ఆస్పత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మదర్ మిల్క్ సెంటర్ నడుస్తుండగా, సుల్తాన్ బజార్ మెటర్నటీ, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ హాస్పిటల్స్ లో కొత్త మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే మిల్క్ సెంటర్లలో తల్లిపాలు సేకరించేందుకు, స్టోరేజ్ చేసేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచుతారు. బాలింతలు ఎవరైనా ఆయా సెంటర్లలో స్వచ్ఛందంగా పాలు దానం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. శిశువు నుంచి దూరంగా ఉన్న తల్లులు కూడా ఈ కేంద్రాలకు వచ్చి మిల్క్ ఇవ్వచ్చు. మరోవైపు తల్లి ఎప్పటికప్పుడు పాలను ఇవ్వడం వలన బ్రెస్ట్ క్యాన్సర్,ఇండో మెట్రో సిండ్రోమ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం నీకు సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది శిశువులు పాల ఆకలి నుంచి విముక్తి పొంద గలుగుతారు. ఇది ఒక మంచి ఆలోచన గా విరా జిల్లుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: