ఆ రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న సరికొత్త వైరల్ ఫీవర్.. మరణాలెన్నో ..?

Divya
వర్షాకాలం సమయంలో సీజన్ ఫ్లూ వల్ల కలిగే జ్వరం అతి సాధారణం అని వైద్యులు చెబుతుంటారు. కానీ అక్కడ కొన్ని రాష్ట్రాలను మాత్రం ఒక గుర్తు తెలియని జ్వరం పిల్లలను, పెద్దలను పట్టిపీడిస్తోంది. అంతేకాదు కొన్ని ప్రాణాలు పోయాయి అని అక్కడి వైద్యులు సూచించారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో గత రెండు , మూడు వారాలు ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడంతో పాటు తీవ్రమైన జ్వరంతో మరి కొంత మంది చనిపోతున్నారు అట. యూపీలోని మధుర నగర్ లో ఈ జ్వరాన్ని 'స్క్రబ్ టైఫస్' గా నిర్ధారించారు పరిశోధకులు..
మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్,  ఎటా , మెయిన్‌పురి  మరియు కస్‌గంజ్ జిల్లాలలో మరణాలు సంభవించిన తరువాత వారి రక్త శాంపిల్స్  తీసుకొని పరిశీలించిన తర్వాత దానిని స్క్రబ్ టైఫస్ గా గుర్తించినట్లు అక్కడ వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాకుండా అస్సాంలో కూడా ఈ వైరస్ ను గుర్తించినట్లు సమాచారం. సుమారుగా 29 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి వైద్య బృందం అధికారులు తెలిపారు. అస్సాం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 15 రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు.
ఇక ఈ 29 బాధితుల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్‌ప్రతీమ్ దాస్ తో పాటు కొంతమంది నర్సులు అలాగే  ఆరోగ్య కార్యకర్తలు,  మరికొంత మంది రోగులు ఉన్నారు. ముఖ్యంగా ఇది   ఓరియెన్షియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి.  లార్వా పురుగుల ద్వారా సోకి, ప్రజలు దీని బారిన పడుతున్నారు.

ఇక ఈ ఫీవర్ వచ్చినప్పుడు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ,దద్దుర్లు, కండరాల నొప్పి మొదలైన నొప్పులు సంభవిస్తాయి. ఈ వ్యాధి సోకిన తర్వాత మనిషి మతి స్థిమితం కూడా కోల్పోతాడు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు మరి కొంత మంది రోగులు మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు, శ్వాసకోశ ఇబ్బందులు, కీళ్లనొప్పులు, మూత్ర పిండాలు చెడిపోవడంతో పాటు వివిధ రకాల అవయవాలకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక పోతే ఈ జ్వరానికి ఇప్పటివరకు టీకా కనుగొనబడలేదు. కానీ డాక్సీసైక్లిన్ మందులతో చికిత్స చేయవచ్చు.. ఇక త్వరలోనే ఈ వ్యాధి నివారణకు టీకాలు కనిపెడతారు అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: