పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజలు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. 2019 వ సంవత్సరంలో మొత్తం 1.79 కోట్ల మంది కూడా గుండె జబ్బుల కారణంగా మరణించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ అధిక రక్తపోటు అనేది ఈ మరణాలలో మూడింట ఒక వంతు కారణమట. హైపర్‌టెన్సివ్ రోగులు ఈ జబ్బుని అర్థం చేసుకోకపోవడం కూడా దీనికి కారణం. ఇక దాని లక్షణాలు కూడా కనిపించవు. అందువల్ల రోగులలో గుండెపోటు వంటి సంఘటనలు అనేవి ఉత్పన్నం అవుతాయి. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు.ఇక ఈ సమస్య శాశ్వతంగా దూరం కావడానికి ధూమ పానం అలవాటుని మానేయాలి.ప్రమాదకరమైన నికోటిన్ ధమనుల గోడలను కుదించడం ద్వారా వాటిని బాగా గట్టిగా చేస్తుంది.ఇక ఇదే కాకుండా ఇది రక్తం గడ్డకట్టడంలో కూడా చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది.
ఒక వ్యక్తి సిగరెట్ తాగిన తర్వాత హార్ట్ బీట్ అనేది సాధారణ స్థితికి రావడానికి 20 నిమిషాలు సమయం పడుతుంది. కాబట్టి ధూమపానాన్ని మానేయడం చాలా మంచిది.అలాగే రోజువారీ మనం తినే ఆహారంలో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు అస్సలు తినవద్దు.ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తాను తినే ఆహారంలో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు ఉండాలి. ఒక టీస్పూన్ ఉప్పులో దాదాపు 2,300 మి.గ్రా సోడియం అనేది ఉంటుంది. ఇక ఆహారంలో ఈ సోడియం మొత్తాన్ని కూడా తగ్గించడం ద్వారా రక్త పోటుని 5 నుంచి 6 పాయింట్లు దాకా సులభంగా తగ్గించుకోవచ్చును.అలాగే రక్త పోటు సమస్యని ఖచ్చితంగా రోజుకు 30 నిమిషాలు నడవాలి. అలా నడిస్తే, అప్పుడు రక్తపోటు 5 నుండి 8 పాయింట్లు దాకా తగ్గుతుంది. అయితే, నడక రోజు మానకుండా చేయాలి, లేకుంటే రక్తపోటు అనేది మళ్లీ వెంటనే పెరగవచ్చు. ఇక ఇదే కాకుండా జాగింగ్, సైక్లింగ్ ఇంకా డ్యాన్స్ కూడా రక్తపోటు సమస్యను ఈజీగా తగ్గిస్తాయి.కాబట్టి నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా నడవండి. రక్త పోటు సమస్యని దూరం చేసుకోండి.