బ్రెయిన్ ఫాగ్ వ్యాధి చాలా ప్రమాదకరమైంది.ఇది ఎందుకు వస్తుందని అనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి.ఈ జబ్బుకి సంబంధించిన కారణాన్ని గుర్తించిన తర్వాత, మీరు ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించవచ్చు. ఇక ఆ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.దీర్ఘకాలిక ఒత్తిడి అనేది రక్తపోటును పెంచుతుంది, అలాగే రోగనిరోధక శక్తిని కూడా తగ్గించి బలహీనపరుస్తుంది. ఫలితంగా మనిషికి నిరాశను కలిగిస్తుంది.అంతేగాక ఇది మానసిక అలసటకు కూడా కారణమవుతుంది. మీ మెదడు పని అయిపోయినప్పుడు, ఆలోచించడం ఇంకా దృష్టి పెట్టడం చాలా కష్టం అవుతుంది.నిద్ర లేమి కూడా బ్రెయిన్ ఫాగ్ కి కారణమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బాగా నిద్ర పోవాలి. రాత్రి పూట ఖచ్చితంగా 8 నుండి 9 గంటల నిద్ర అనేది చాలా అవసరం. చాలా తక్కువగా నిద్రపోవడం వలన ఏకాగ్రత ఇంకా మేఘావృతమైన ఆలోచనలకు దారితీస్తుంది.అలాగే హార్మోన్ల మార్పులు కూడా బ్రెయిన్ ఫాగ్ సమస్యకి కారణమవుతాయి.
గర్భధారణ సమయంలో ప్రొజెస్టెరాన్ ఇంకా ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఈ మార్పు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే స్వల్పకాలిక అభిజ్ఞా బలహీనతకు కూడా కారణమవుతుంది. ఇక అదేవిధంగా, రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోవడం జరుగుతుంది. అందువల్ల మతిమరుపు, ఏకాగ్రత ఇంకా మేఘావృతమైన ఆలోచనకు ఇది కారణమవుతుంది.బ్రెయిన్ ఫాగ్ సమస్య రాడానికి ఆహారం కూడా పాత్ర పోషిస్తుంది.
విటమిన్ బి -12 ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక
విటమిన్ బి -12 లోపం వల్ల బ్రెయిన్ ఫాగ్ వ్యాధి వస్తుంది. కాబట్టి
విటమిన్ బి -12 కోసం పీనట్స్ ఎక్కువగా తీసుకోండి.బ్రెయిన్ ఫాగ్ వ్యాధి రాకుండా వుండాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చెయ్యండి. రోజు మెడిటేషన్ చెయ్యడం వల్ల బ్రెయిన్ ఫాగ్ వ్యాధి వచ్చే అవకాశం ఉండదు.అలాగే ఎప్పటికప్పుడు ఒంట్లో నలతగా వున్నా కాని లేక తల నొప్పి సమస్య ఎక్కువగా వున్నా కాని ఖచ్చితంగా
డాక్టర్ దగ్గరకి వెళ్లి మెడికల్ చెకప్స్ అనేవి చేసుకోండి. బ్రెయిన్ ఫాగ్స్ వ్యాధి రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.