ఆదివాసుల కట్టుబాటు వారి జీవనశైలి ఆహార వ్యవహారాలు మహమ్మారి కరోనా కట్టడికి మంత్రాలుగా చెబుతున్నారు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా కొన్ని అడవి మారుమూల గ్రామాలు అయినటువంటి ఎర్రం పాడు, చెన్నాపురం, బక్క చింతలపాడు, కిష్టారం పాడు, కొండేడా వాయి, తిమ్మిరి గూడెం, బూరుగు పాడు, బట్టు గూడెం, కమలాపురం, కోరుకొండ, రామచంద్రపురం పలు మారుమూల గ్రామాలకు ఇప్పటివరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వారు చెబుతున్నారు.
దీన్ని బట్టి చూస్తే వారిలో రోగనిరోధక శక్తి ఎంత వరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కొత్తగూడెం జిల్లాలోని దాదాపు 20 గ్రామాల వరకు గుత్తి కోయ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోణ వైరస్ వారి దరి చే రకపోవడం, గమనార్హం. ఈ ప్రాణాంతక వైరస్ ఆదివాసిలో దాగి ఉన్న నిగూఢమైన వ్యాధి నిరోధక శక్తి వారికి ఒక కవచంలా పనిచేస్తున్నది. మారుమూల గిరిజన గ్రామాలకు విస్తరిస్తున్నా కొద్ది కేసులలో ఆ గ్రామాలు బయటపడుతున్నాయి. అడవి గ్రామాల్లో ఉండే గుత్తికోయలు గ్రామాలకు కరోణ వ్యాప్తి చాలా వరకూ జరగలేదు అని చెప్పవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఇంటిల్లిపాది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వారిది. వారి యొక్క శారీరక శ్రమ వల్ల వారు కరోనా నుంచి దూరం అవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదివాసీల ఆహారం ఎంతో బలవర్ధకంగా ఉంటుంది. పూర్వకాలం నుంచి వాడే ఎటువంటి ధాన్యం, వారిలో ఎనలేని శక్తినిస్తుంది. వారు ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించి వాటిని ఆహారంగా తీసుకుంటారు. వీరు ఎక్కువగా తృన ధాన్యాలతో తయారు చేసిన జావా ఎక్కువగా తాగుతారు. దీని ద్వారా కరోనా వైరస్ ను అడ్డుకునే శక్తి వారిలో విరివిగా వుంటుంది.
ధాన్యాన్ని దంపుడు బియ్యం నూకలుగా మార్చి అన్నం జావా తయారు చేసి తింటారు. పోషకాలు అధికంగా ఉండే దంపుడు బియ్యంతో ఎంతో శక్తి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఉండే విలువైన పోషకాలు వీరి కి కరోణ రాకుండా అడ్డుకుంటున్నాయి అనుకోవచ్చు. ఒకవేళ వచ్చినా వచ్చిందని వారికి తెలియకుండానే వారి రోగనిరోధక శక్తి ఆ వైరస్ ను అంతం చేస్తుందని తెలుస్తోంది.