
కరోనా నుంచి కోలుకున్న వారికి శుభవార్త...స్పెషల్ డోస్ వచ్చేసింది ?
ఈ నేపథ్యంలో తాజా సర్వేలు... కరోనా నుంచి కోలుకున్న వారికి శుభవార్త చెబుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ యొక్క ఒకే డోసు కరోనా రోగులకు వేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి ఈ స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ వేస్తే... వారిలో 94 శాతం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. ఈ స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ వేసుకున్న 21 రోజుల తరువాత... వారిలో 94 శాతం మందికి వ్యాధి నిరోధక శక్తి పెరిగిందట. ఈ సర్వేల ప్రకారం... కరోనా నుంచి కోలుకున్న వారికి ఈ స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ ఒక్క డోసు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ స్పుత్నిక్ -వి వ్యాక్సిన్... మన దేశంలో మే 1 వ తేదీ నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ విషయంలో ఇండియాకు రష్యాకు మంచి ఒప్పందం కూడా కుదిరింది. కాగా.. దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41 వేల కేసులు నమోదు అయ్యాయి. అలాగే.. ఇప్పటి వరకు 3847 మంది దేశ వ్యాప్తంగా కరోనా తో మృతి చెందారు.