వర్షాకాలం ఎంత డేంజరో అందరికి తెలుసు. అందుకే ఈ కాలాన్ని వ్యాధుల కాలం అని అంటారు. ఈ కాలంలో ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ఉన్నా అనేక వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ నేపథ్యంలో వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలేంటో ఖచ్చితంగా తెలుసుకోండి..ఇక ఈ కాలం లో ప్రజలు ముఖ్యంగా విరేచనాలు, వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు ఇతర సీజనల్ వ్యాధుల భారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. పైగా ఈ కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండక పోతే ఏది సీజనల్ వ్యాధో? లేక ఏది కరోనానో? తెలియక చాలా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఏ కాలంలో అయినా సరే జనాలు ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ కి బాగా అలవాటు పడతారు. ఈ వానా కాలంలో అయితే స్ట్రీట్ ఫుడ్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. వీధుల వెంట అమ్మే ఆహారం, పండ్ల ముక్కలు శుభ్రంగా వుండవు. ముఖ్యంగా ఈ వానా కాలంలో ఈగలు, దోమల కారణంగా ఇంకా ఆహార పదార్ధాలు అసలు శుభ్రంగా వుండవు.ఆయిల్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు.వానా కాలంలో ఆయిల్ ఫుడ్ ను బాగా తగ్గించుకోవాలి. ఆయిల్ ఫుడ్ తింటే విరేచనాలు, జీర్ణక్రియలో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. సమోసా, పాపడ్ వంటి నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినొద్దు.ఇక ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివే అయినా కాని వీటిలో ఈ వానా కాలంలో బ్యాక్టీరియా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఇక గొంగళి పురుగులు అయితే ఈ సీజన్లో ఆకు కూరలలో చాలా త్వరగా కనిపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో ఆకు కూరలు ఎక్కువగా తింటే విరేచనాలు, కడుపు నొప్పు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో బచ్చలికూర, మెంతి, పాలకూర ఆకులు ఇంకా పుట్టగొడుగులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి వాటిని తినడం పూర్తిగా మానేయాలి.