కరోనా సోకిన వారిలో రక్తం అందుకే గడ్డ కడుతుందా..?

Suma Kallamadi
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళిని కరోనా రక్కసి గడగడళాడిస్తోంది. కరోనా సోకిన వారిలో రక్తం ఎందుకు గడ్డకడుతుందనే విషయం పై ఐర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి.. దిమ్మ తిరిగిపోయే విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్లు ఎందుకు రక్తం గడ్డ కడుతుందనే ప్రశ్నకు వీరి పరిశోధనతో సమాధానం లభించినట్లయింది.


విషయమేంటంటే.. పాజిటివ్ వచ్చిన వారిలో కొన్ని ప్రత్యేకమైన అణువులు భారీ సంఖ్యలో పెరుగుతాయట. ఈ కారణం చేతే.. బాడీలో రక్తం గడ్డకడుతుందని వారు నిర్ధారించారు. అంతే కాకుండా ఈ కారణంతో రోగి మరణించే ప్రమాదం పెరుగుతుందనే షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రికి వచ్చిన కరోనా రోగులపై ఈ పరిశోధనలు చేశారు. వాళ్ల నుంచి రక్త నమూనాలను తీసుకున్న తర్వాత పరిశోధనలు చేశారు. ఇందులో వెల్లడైన షాకింగ్ విషయమేంటంటే.. వీరిలో విడబ్ల్యుఎఫ్ అణువులు మోతాదుకు మించి..  అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రక్తం గడ్డ కట్టడానికి ఈ అణువులు ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.


రక్తం గడ్డ కట్టకుండా ఆపే ADAMTS13 అణువుల స్థాయి విపరీతంగా తక్కువగా ఉందని వెల్లడించారు. కరోనా వ్యాధి గ్రస్తులలో ADAMTS13 మరియు VVF స్థాయిని నిర్వహించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమట. ఈ విషయాన్ని స్వయంగా ఈ పరిశోధనలు చేసిన డాక్టర్ జామీ ఓసుల్లివన్ తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారంగా.. కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం వల్ల 26 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 498 కేసులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారని.. ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి అవకాశాలను కేవలం 26 మంది లో మాత్రమే గుర్తించారట. మరో  విషయం ఏమిటంటే ఎవరైతే కోవాక్సిన్ తీసుకుంటారో... వారిలో రక్తం గడ్డ కట్టినట్లు ఇప్పటి వరకు గుర్తించలేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: