పిల్లలకు 2021లో ముప్పు తప్పదా...?
ఆహార పదార్థాలలో పోషక విలువలు పడిపోవడం, పంట వైఫల్యాల ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ద్రవ్యోల్బణం పెరగడం గురించి యూఎస్ ఐపీసీ ముసాయిదా నివేదిక అందించింది. ఉష్ణోగ్రతలు పెరగడం కార్బన్, ఉద్గారాల ద్వారా వచ్చే నష్టాలను ప్రజలు ఎంత వరకు తట్టుకోగలరు..? 2021లో జన్మించే పిల్లలు వచ్చే 30 ఏళ్లలో ఎదుర్కోబోయే వాతావరణ ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏంటి..? అనేదానిపై ఈ నివేదిక ద్వారా వివరించింది. రాబోవు రోజుల్లో ఇప్పుడున్న దానికంటే 80 మిలియన్ మంది ప్రజలకు ఆకలితో ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే పది సంవత్సరాలలో నీటి భద్రత, పోషకాహార లోపం, తెగుళ్ల ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని మీడియా సంస్థ ఏ ఎఫ్ పి తెలియజేసింది.
అయితే ప్రస్తుత కాలంలో మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వంటి మార్పులు చేస్తే ఈ ఆరోగ్య పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కీలక పంటల దిగుబడిపై ప్రభావితం చేయడమే కాకుండా, వాటిలోని పోషక విలువలను తగ్గింపు చేస్తాయని, గోధుమ, వరి, బార్లీ, బంగాళదుంప వంటి పంటలలో ప్రోటీన్స్ ఆరు నుంచి 12 శాతం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల దాదాపు 150 మిలియన్ ప్రజల్లో పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉందని నివేదిక ద్వారా పేర్కొంది. ఇప్పటికైనా ప్రజలు గమనించి వాతావరణంలో కలుషితం కాకుండా చూడాలని సంస్థ పేర్కొంటోంది.