టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?

MOHAN BABU
టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?


 కరోనా మహమ్మారి వచ్చాక చాలామందికి  మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని చెప్పవచ్చు. మహమ్మారి టెన్షన్ కి తోడుగా ఉద్యోగ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు చాలా మందిని  బాధిస్తున్నాయి. దీంతో  ఒక్క రోజు కూడా  బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. స్వచ్ఛమైన గాలి అందడం లేదు. దీంతో  మానవుల్లో కోపం, చిరాకు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.  వీటిని తగ్గించుకోకపోతే  నేరాలకు దారితీస్తాయి. వీటి నుండి  బయటపడాలంటే  సహజమైన ఎక్సర్సైజులు, యోగా చేయాలి.


 దీనివల్ల  ఒత్తిడి పెంచే హార్మోన్ ల విడుదలను తగ్గిస్తాయి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల  ఎన్ఫోర్పిను హార్మోన్ విడుదలై మెదడుకు  ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని చేరవేస్తుంది. అలాగే మెదడులో గమ్మ - అమైనోబ్యూటీరిక్ యాసిడ్ ను  ఎక్కువగా ఉత్పత్తి చేసి ఒత్తిడి నుంచి  ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆవేశం, ఆత్రుత వంటివి ఎప్పటికైనా ప్రమాదకరమే..  మనపై మనకు  కంట్రోల్ ఉండాలి. ఆసనాలు వేయడం వల్ల మనలో కోపం, ఉద్రేకం తగ్గిస్తాయి. నిద్ర బాగా పట్టేలా చేసి, పాజిటివ్ ఆలోచనలను పెంచటానికి తోడ్పడతాయి. దీంతో ఒత్తిడి సమయంలో టెన్షన్ పెంచుకోకుండా నిలకడతో ఉండగలుగుతారు.
ఊపిరి ఎలా పీల్చలో, శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ ఎలా పంపాలో ప్రాణాయామం ఆసనం ద్వారా తెలుస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. దీంతో  మానసికంగా ఫిట్ అవుతారు.  బ్రిడ్జి ఫోజ్.. దీన్ని సేతు బంధాసనం అంటారు. ఈ ఆసనం మానవ శరీరంలో  రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. ఈ మనలోని  ఆత్రుత,  మదనపడేతత్వాన్ని అదుపులో ఉంచుతుంది. కాళ్లు, వెనక భాగం  మరింత చక్కగా సాగి  నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

ఒంటే ఆసనం.. ఈ ఆసనం వేసినప్పుడు మనలో ముఖ్యంగా ఒత్తిడి తగ్గిపోతుంది. ఒక్కసారిగా  శరీరంలో  రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా తయారవుతుంది. మెదడుకు  ఆక్సిజన్ సప్లై  పెరుగుతుంది. దీనివల్ల  మనసు ఆహ్లాదంగా తయారై  ప్రశాంతంగా ఉంటాం. 
బాణాసనం.. ఈ ఆసనం అనేది మన నాడీ వ్యవస్థను  కాపాడుతుంది. దీంతోపాటు సోషరసం క్రమబద్ధీకరించినట్లు అవుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: