
ఇంట్లో ఎలుకల బెడదా తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి...
ఒక దూదిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఆ ఉండలని పెప్పర్‌మింట్ ఆయిల్‌లో ముంచాలి. ఇక వాటిని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. ఇక దెబ్బకి ఆ పిప్పర్‌మెంట్ ఆయిల్ వాసన పడక ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి.ఇక మన వంటింట్లో దొరికే లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా ఎలుకలను ఇబ్బంది పెట్టి వాటిని తరిమి కొడుతోంది. అందుకే ఒక గుడ్డలో కొన్ని లవంగాలు వేసి ఇంటి మూలల్లో ఉంచాలి. ఇక రోజు ఇలా చేస్తే ఎలుకలు పారిపోతాయి.ఇక సహజసిద్ధమైన మంచి ఎలుకల మందు ఏదైనా ఉందా అంటే అది కారం అనే చెప్పాలి. ఇక మన ఇంట్లో అప్పుడప్పుడూ ఎండుమిర్చిలను కాల్చాలి. ఆ ఎండు మిర్చీల ఘాటు పడక ఎలుకలు పారిపోతాయి. ఒక గుడ్డలో కారం పొడి వేసి అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేస్తే ఎలుకలతో పాటు చీమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు అన్ని పారిపోతాయి.