మిరియాలతో శరీరంలో కఫాన్ని తగ్గించవచ్చట !
కరోనా వైరస్ ఎంతగానో విజృంభిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వైరస్ నుంచి బయటపడాలంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన వంటింటి పప్పు దినుసులే బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అందరూ వాటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు చెక్క, లవంగాలు, మిరియాలు వంటివి ఎప్పుడో ఒకసారి కొనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు షాపులో ఇది దొరకడమే కొంత ఇబ్బందికరంగా మారింది. అంతా ఇప్పుడు వంటింటి దినుసులపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అలాంటి వాటిలో మిరియాలు కూడా ఒకటి. అయితే మిరియాలు చేసే మేలు ఎంతో చూద్దాం.
1). మిరియాలు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. ఇక ఇది ఘాటయిన వాసన కలిగి ఉండటం వల్ల ఇది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి.
2). కొన్ని మిరియాలు తీసుకుని దోరగా వేయించి, వాటిని పొడిగా చేసి, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి మిశ్రమం, ఒక గ్లాసు మంచినీరు, వీటన్నిటినీ మరిగించి అందులో కొంచెం తేనె వేసుకుని, రోజులో రెండు మూడు సార్లు ఈ ద్రావణాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి.
3). రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇది ఎంతగానో సహాయపడతాయి.
4). మిరియాలు తీసుకున్న వారిలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అందువల్ల వారిలో జీర్ణ ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. అంతేకాకుండా మూత్రవిసర్జన సాఫీగా జరుగుతుంది.
5). కండరాల నొప్పిని తగ్గిస్తుంది, అజీర్ణ సమస్యతో బాధపడుతున్నవారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాత బెల్లంతో కలిపి,చిన్న ఉండలుగా చేసి రోజూ భోజనం ముందు తీసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది.
6). కడుపులో వాయువు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో ఒక స్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
7). అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు భోజనం ముందు కొంచెం మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని, ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే తగిన ఫలితం లభిస్తుంది.