భారత దేశంలో మజ్జిగకు మంచి డిమాండ్ ఉంది..
మజ్జిగ లో ఎన్నో మినరల్స్ ,విటమిన్స్ ఉన్నాయి. రోగ నిరోధక
శక్తి పెంచుకోవడం వల్ల కరోనా లాంటి మహమ్మారికి
చెక్ పెట్టవచ్చు. ఇంకా అనే రకాల ఆరోగ్యానికి
మజ్జిగ పని చేస్తుంది. అదేంటో మన లైఫ్ స్టైల్లో చూద్దాం. శరీరం శక్తిని కోల్పోయినప్పుడు, పొడిబారుతున్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు ముఖ్యం గా వేసవి కాలం లో ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల
మజ్జిగ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తేమను అందించి
శక్తి పుంజుకొనేలా చేస్తుంది. సూర్యతాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా
మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది.
మజ్జిగలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి.. కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.
మజ్జిగ మాత్రం ఆరోగ్యానికి అమృతం అని చెప్పాలి.మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా
మజ్జిగ లక్షలరెట్లు మంచిది. ఊబకాయం తో సతమతమయ్యేవారు ప్రతి రోజు
మజ్జిగ ను తీసుకోవాలి. మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటం తో శరీరం లో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది..
ఇకపోతే
మజ్జిగ లో
విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్,
నియాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
మజ్జిగ లో ఇంగువనూ, జీల కర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. పైల్స్ వ్యాధి లో
మజ్జిగ బాగా పనిచేస్తుంది. శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. కరోనా లాంటి మహమ్మారి నుంచి
మజ్జిగ కాపాడుతుంది. అన్నీ విధాలుగా ఫలితాలు ఉంటాయి.. అందుకే ఇప్పుడు మజ్జిగను తాగే వారి సంఖ్య పెరిగింది.