కని కరోనా : డేంజర్ జోన్లో ఆ 30 జిల్లాలు..ఏపీలో ఎన్నంటే.. ?
రాష్ట్రంలో 20శాతం పైగా పాజిటివిటీ నమోదవుతుంది.తెలంగాణలోనూ కరోనా ఉదృతి ఎక్కువగానే ఉండగా కేసులు విషయంలో ఏపీ గ్రాఫ్ మాత్రం పైపైకి వెళుతోంది. రోజూ వారి కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో మొత్తం 24 జిల్లాలుండగా ఆంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో ఉంది. బుధవారం ఒక్క రోజే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 22వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 12,03,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా రాష్ట్రంలో ఇప్పటివరకూ 8,374 మంది మరణించారు . కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఉదయం కూడా కర్ఫ్యూ విదిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యాహ్నం తరవాత రాష్ట్రానికి వస్తున్న అంతరాష్ట్ర వాహనాలను వెనక్కిపంపిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో కఠిన నిభందనలు అమలు చేస్తున్నారు .