
హాట్ వాటర్ తో కరోనా పోదట.. ఎందుకంటే..?
అప్పుడే జన్మించిన శిశువుకు తల్లి నుంచి కరోనా ఇప్పటివరకు సోకలేదని వేరే రోగులు, ఇతర కారణాల వల్ల కరోనా సోకే అవకాశాలు అయితే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన తల్లులు ఎన్95 మాస్కు వేసుకుని పిలల్లకు పాలు ఇవ్వవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాత వైరస్ సోకే అవకాశాలు అయితే తగ్గుతాయి.ఇతర వైరస్ లకు కనుగొన్న వ్యాక్సిన్లు కరోనాకు పని చేయవని ఆ వ్యాక్సిన్లు వేయించుకున్నా ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన తొలి 3 నుంచి 4 రోజుల్లో ఫావి ఫిరావిర్ లేదా ఫాబి ఫ్లూ మందులను వాడాలని డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్ కరోనాకు చెక్ పెట్టడంలో బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటేనే డెక్సామెథజోన్ ను వాడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కూడా భయపడకుండా ఉంటే చాలా మంచిది. అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండటం కూడా సబబు కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి...