గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!

Suma Kallamadi
గసగసాలను మనం ఎక్కవగా వంటలో వాడుతుంటాము. సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. గసగసాలను కూడా పూర్వ కాలంలో మందుల తయారీలో వాడేవాళ్లు. ఇక వీటి కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది మసాలా ఐటెమ్స్ కొనుక్కుంటారు. అంతేకాదు.. గసగసాలను ఎక్కువగా కొనేందుకు ఇష్టపడరు. కానీ గసగసాల వలన ఆరోగ్యానికి తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు... కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. నిద్రకు మేలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి.

ఇక రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు చక్కటి నిద్ర వచ్చేస్తుంది. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే, మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని  అంటున్నారు.

అంతేకాదు.. శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ (నయం చేసే గుణాలు) గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, షుగర్ కలిపి మార్నింగ్, ఈవెనింగ్ హాఫ్ స్పూన్ (అర చెంచాడు) తీసుకొంటే గుండె హాయిగా ఉంటుంది. గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ వున్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: