హెల్త్ : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే ప్రాణాపాయమే...

Purushottham Vinay
కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది బయటకి రాకుండా ఇంట్లో వుండే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. వివిధ కంపెనీలు కూడా ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. కనుక చాలా మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డారు. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డ ఉద్యోగస్తులు చాలా సమస్యలు ఎదురుకుంటున్నారని తాజా సర్వేలో వెళ్లడయింది. ఇక చాలా మంది ఏముందిలే అని తమ ఆఫీస్ వర్క్ ని మంచం మీదే కూర్చొని గంటలు తరబడి చేస్తున్నారట. కాని ఇలా వంగి పని చేయడం వల్ల భుజాలు మరియు మెడ మీద కూడా ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా అది నొప్పికి దారి తీస్తుంది అలాగే మీ నడుముని పొట్టని వంచి పని చేయడం వల్ల ఇది తీవ్రంగా నొప్పి ఎలా చేస్తుంది.అలాగే ఇలా పని చెయ్యటం వలన చాలా మంది నిద్ర లేమి సమస్యకి గురవుతున్నారట.


ఇలా మంచం మీద కూర్చొని కాకుండా శుభ్రంగా మీ లాప్ టాప్ కి ఇంకా మీకు ఒక టేబుల్ ని కుర్చీని ఏర్పాటు చేసుకొని వర్క్ చేసుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గంటలు తరబడి కూర్చోకుండా మధ్యలో కొద్ది సేపు విరామం తీసుకొని అటు ఇటు తిరిగితే మంచిదట. లేదంటే చిన్న పిల్లలతో ఆదుకోవడం అలాంటివి చేస్తే ఒత్తిడి సమస్య దూరం అవుతుందట.ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఉదయం పూట వ్యాయామాలు చెయ్యాలట.వ్యాయామం చెయ్యటం వలన రోజంతా చాలా హుషారుగా ఉంటారట.ఇక మంచి తాజా పండ్లని తింటూ వుండాలట.


అలాగే పని ఒత్తిడిలో పడి చాలా మంది కాఫీలు టీలు తాగుతూ వుంటారు. అవి కూడా ఈ ఎండాకాలంలో మంచివి కావట. రోజుకి రెండు సార్లు తీసుకుంటే చాలు. ఇక అంతకు మించి తీసుకోకూడదు. వాటికి బదులు చల్లని జ్యూసులు, మజ్జిగ లాంటి శీతల పానీయాలు తీసుకోవడం చాలా మంచిదట. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: