హెల్త్ : రాత్రిళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా? అయితే జాగ్రత్త...

Purushottham Vinay
కొంతమంది తమ బయట పనుల వల్లనో లేక ఆఫీస్ లో పని వలనో రాత్రి ఇంటికి చాలా లేట్ గా వస్తుంటారు. ఆ క్రమంలో రాత్రిళ్ళు సరిగ్గా భోజనం చెయ్యరు. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధ రాత్రుళ్ళు తింటారు.వేళాపాల లేకుండా ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనేది నిజం. ఇప్పుడు ఆ లేట్ నైట్ డిన్నరే ప్రజల లైఫ్‌స్టైల్‌లో భాగమైంది. అర్ధరాత్రిళ్లు స్నేహితులతో కలిసి ఆహారం తింటూ ఎంజాయ్ చేసేవారు కొందరైతే. పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల సమయానికి తినలేక.. అర్ధరాత్రి ఆహారం తీసుకొనేవారు మరికొందరు. అయితే, ఇది అలవాటుగా మారితే ఎంత ప్రమాదమో తెలుసా? ముఖ్యంగా నైట్ డ్యూటీలు చేసేవారు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.పోష‌కాహార నిపుణులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నిద్రపోయే ముందు రెండు గంటల ముందే ఆహారాన్ని తినేయాలి. తిన్న వెంటనే నిద్రపోతే రక్తంలో చక్కెర శాతం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి.. డయాబెటీస్ రోగులతో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. నిద్రపోడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అర్ధరాత్రిళ్లు ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఖచ్చితంగా తెలుసుకోండి...



నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. చాలామంది టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు అతిగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై ప్రభావం చూపుతాయని ఓ పరిశోధనలో పేర్కొన్నారు.నిద్రపోయే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గమనించారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి.. మీకు కూడా ఈ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవు.నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగటంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలు ఏర్పడతాయి. వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: