కండరాలు బలంగా ఉండాలంటే... ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి...

kalpana
ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కండరాలు బలంగా ఉండటానికి ఈ ఆకు కూరలు బాగా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. రోజు ఒక కప్పు పచ్చటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారుతాయని న్యూ ఎడిట్ కొవాన్ విశ్వవిద్యాలయం పరిశోధించి అందులో  అంశాలను జర్నల్  ఆఫ్ న్యూట్రీషియన్స్ లో ప్రచురించారు. ఆకుకూరల్లో ఉండే నైట్రేట్ కండరాలు  బలంగా పని చేయడానికి దోహదపడతాయి. శరీరంలోని  కండరాల పనితీరు మెరుగుపరచడానికి పచ్చని ఆకుకూరలను ఈ రోజు తీసుకోవాలి. పచ్చగా ఉండే ఆకుకూరలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే అవి శరీరానికి అత్యవసరమని డాక్టర్లు తెలుపుతున్నారు. అలాగే నైట్రేట్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు తీసుకోవాలి. అవి పాలకూర, బచ్చలి కూర, బీట్ రూట్ వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి  రోజు పచ్చని ఆకు కూరలు తీసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్ సిస్టం సరిగ్గా పని చేయడానికి ఆకుకూరలు దోహదపడతాయి.              
 సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధుల్లో కండరాల  పనితీరు బాగుండాలంటే పచ్చటి ఆకు కూరలు తీసుకోవాలి. డాక్టర్ సిమ్స్ నైట్రేట్ పై జరిపిన పరిశోధన కండరాల  పనితీరుపై జరిపారు. ఇందులో పచ్చటి ఆకు కూరలు తీసుకున్నవారిలో కండరాలకు బలం గా ఉన్నాయని తేలింది.కండరాలు బలంగా, శక్తివంతంగా ఉండానికి చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే తగినన్ని పోషకపదార్థాలు శరీరానికి అందకపోతే ఈ వ్యాయామాలు చేసినా ప్రయోజనం ఉండదు... కండరాలు బలంగా ఉండవు. కండరాలు శక్తివంతంగా ఉండడానికి నాలుగు రకాల ఆహార పదార్థాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటంటే...
విటమిన్‌-సి
రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండానికి విటమిన్‌-సి అత్యావశ్యకం. కండరాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ అందించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఎంత ఎక్కువ విటమిన్‌-సి తీసుకుంటే కంౄడరాలకు అంత మంచిది. సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే శారీరకంగా చురుగ్గా ఉంటారు. అందుకే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదాౄర్థాలని బాగా తీసుకోవాలి. కివి పండు, ఆకుకూరలు, సా్ట్రబెర్రీస్‌, కమలాలు వంటివి బాగా తినాలి.
 పచ్చని ఆకు కూరలు వినియోగం, వినిమయం రక్తనాళాలపై వృద్ధి వంటి అంశాలను సాధారణ ప్రజలపై ఉంటుందని డాక్టర్ సిమ్స్ ఉన్నారు. ఇది కేవలం ఒక మోడల్ మాత్రమేనని అనారోగ్య అంశాలపై ఎలాంటి పరిజ్ఞానం గ్రహించారు అన్నది ముఖ్యం అంటారు డాక్టర్ సిమ్స్. దీర్ఘకాలికంగా  ఆరోగ్యంగా ఉండాలంటే సరైన  ఆహారం, వ్యాయామ పై దృష్టి పెట్టాలి



.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: