ఉదయం త్వరగా లేవాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి.!

frame ఉదయం త్వరగా లేవాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి.!

MADDIBOINA AJAY KUMAR
జీవితంలో విజ‌యం సాధించాలంటే ముందుగా ఉద‌యాన్నే లేవ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఉద‌యాన్నే లేస్తే ఏమైనా బాగుప‌డ‌తావ్‌..అని జులాయి సినిమాలో హీరోను తండ్రి అంటే ఉద‌యాన్నే కోడి కూడా లేస్తుంది. ఏం భాగుప‌డింది. చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటూ హీరో డైలాగులు కొడ‌తాడు. అయితే ఇవి కేవ‌లం సినిమాల్లో విన‌డానికే బాగుంటాయి. నిజ జీవితంలో మాత్రం అంద‌కు భిన్నంగా ఉంటుంది. ఉద‌యం లేవ‌డం వ‌ల్ల మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. అంతే కాకుండా రోజులో ఎక్కువ స‌మ‌యం దొరుకుతుంది కాబ‌ట్టి అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేసుకోవ‌చ్చు. అయితే ఉద‌యం వాతావ‌ర‌ణం చ‌ల్లగా అవుతుంది కాబ‌ట్టి లేవ‌డానికి కాస్త బ‌ద్ద‌కంగా ఉంటుంది. లేవాలంటే పెద్ద క‌ష్టంగా కూడా అనిపిస్తుంది. కానీ ఉద‌యాన్నే లేవ‌డం అంత క‌ష్టమేమీ కాదు. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా లేవ‌చ్చు. ఉద‌యం లేవ‌డం కోసం కొన్ని టిప్స్ ను ఇప్పుడు చూద్దాం.

రాత్రి త్వ‌ర‌గా ప‌డుకోవాలి
రాత్రి స‌మ‌యంలో తొంద‌ర‌గా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఉద‌యం త్వ‌రగా లేవ‌డానికి ఈజీ అవుతుంది. అందుకు ప్ర‌తి రోజు ప‌డుకునే ముందు ఒక గంట ముందు ప‌డుకుంటే..ఒక గంట ఆల‌స్యంగా లేవ‌చ్చు. ప‌డుకునే ముందు ఫోన్‌, ల్యాప్ టాప్ ను స్విచ్ఛాఫ్ చేసి ప‌క్క‌న పెట్టేయాలి. అవి చేతిలో ఉంటే ఏదో ఒక ఆలోచ‌న రావ‌డం తో నిద్ర ప‌ట్ట‌దు. అంతే కాకుండా ప్ర‌తిరోజు పడుకునే ముందు గోరువెచ్చ‌ని పాల‌ని తాగాలి. క‌డుపు ఫుల్ గా తిన‌కుండా..లేదా ఆక‌లితో ఉండ‌కుండా చూసుకోవాలి.

లేచాక ఏం చేయ‌లో ఆలోచించ‌డం
ఉద‌యం లేచాక ఏం చేయాలో ముందుగానే ఆలోచించాలి. దాని వ‌ల్ల అనుకున్న స‌మ‌యానికి మెలుకువ వ‌స్తుంది. అంతే కాకుండా ఉద‌యం లేచిన త‌ర‌వాత ఏదైనా కొత్త‌గా నేర్చుకుంటే ఇంకా మంచిది. కొత్త భాష‌, చిత్ర‌లేఖ‌నం, లేదంటే వ్యాయామం చేయడం అల‌వాటు చేసుకోవాలి.

మంచి బ్రేక్ ఫాస్ట్
ఉద‌యం త్వ‌ర‌గా లేవ‌డం వ‌ల్ల ఆక‌లి ఎక్కువ అవుతుంది. అయితే లేచిన స‌మ‌యానికి తినే స‌మ‌యానికి ఎక్కువ‌గా గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అంతే కాకుండా మంచి ప్రోటీన్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాల‌లి. అలా తీసుకోవ‌డం వ‌ల్ల రోజంత‌టికీ కావాల్సిన శ‌క్తి శ‌రీరానికి అందుతుంది.


వ్యాయామం చేయ‌డం
ఉద‌యం లేచిన త‌ర్వాత ప్ర‌తిరోజు వ్యాయామం చేయ‌డం అలవాటు చేసుకుంటే మీరు హెల్తీ రొటీన్ లోకీ అడుగుపెట్టిన‌ట్టే. రాత్రి ప‌డుకునే ముందే వ్యాయామానికి అవ‌స‌ర‌మైన డ్రెస్, షూస్ ల‌ను ద‌గ్గ‌రగా పెట్టుకోవాలి. వ్యాయామానికి ముందు, వెనక మంచి నీరు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: