తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉందా..? అయితే ఏం చేయాలో తెలుసా..!

Divya

మన శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోయినప్పుడు, మనం ఎక్కువగా కొన్ని ఊహించని జబ్బుల బారిన పడతామని  అందరికీ తెలుసు. మన శరీరంలోకి ప్రవేశించిన, ఫ్రీరాడికల్స్ తో పోరాడి,  వాటిని నాశనం చేయగల శక్తి ఈ తెల్ల రక్తకణాలకు ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలో ఎర్రరక్తకణాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో,  అంతే స్థాయిలో తెల్లరక్తకణాల కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఈ తెల్ల రక్త కణాలు స్థాయి తగ్గిపోతుందో, క్రమంగా మనం జబ్బుల బారిన పడతాము . అయితే  సహజంగా ఈ తెల్లరక్తకణాల సంఖ్య పెంపొందించుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు ఇక్కడ పదవి తెలుసుకుందాం..

బచ్చలి కూర :
బచ్చలి కూర ఖనిజాలకు, విటమిన్ లకు మంచి వనరు. బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి బచ్చలకూర తినడం వలన మన శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది..

వెల్లుల్లి :
వెల్లుల్లి లో ఇమ్యూనోమోడ్యూలేటరీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా లింఫోసైట్లు, ఇసినోఫిల్స్ తో పాటు మాక్రో ఫేజెస్ ఉన్నాయి తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి ని నిత్యం తినడం వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

బొప్పాయి ఆకులు :
బొప్పాయి ఆకుల లో ఏసిటోజెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య పెంపొందించేలా చేస్తుంది.  బొప్పాయి ఆకులను రసం చేసుకొని తాగడం వల్ల జలుబు,దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

పెరుగు :
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.  మధ్యాహ్నం పూట భోజనం చేసేటప్పుడు పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలి. తద్వారా మన శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య పెరిగి రోగనిరోధక శక్తి పెంపొందుతుంది..

తెల్ల రక్త కణాలు మన ఆరోగ్యానికి రక్షకభటులు లాంటివి. కాబట్టి మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలి  అంటే మన శరీరంలో తెల్ల రక్త కణాలు స్థాయి తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: