పొడి దగ్గు ఇబ్బంది పెడుతోందా..? అయితే ఇలా చేయండి..?
సాధారణంగా జలుబు, దగ్గు అంటే ఒక ఇబ్బందికరమైన సమస్యలు. ఇవి మనతో పాటు పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వల్ల మన శరీరంలో ఏదో కోల్పోయామనే భావన కూడా కలుగుతుంది. జలుబు చేస్తే ఎన్ని ఇబ్బందులు పడాలో, దగ్గు వస్తే అన్ని అవస్థలు పడాలి. ఈ సమస్యలు మనతోపాటు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మన కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక నిద్ర విషయానికొస్తే అంతే, రాత్రిపూట మనకు నిద్ర ఉండదు. మనకు వచ్చే జలుబు, దగ్గు వల్ల ఇతరులకు కూడా నిద్ర ఉండదు.. ముఖ్యంగా పొడి దగ్గు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పొడి దగ్గు నుండి బయటపడాలి అంటే కొన్ని చిట్కాలను పాటించి బయటపడవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
పసుపు ను పాలలోకి వేసుకొని తాగడం వల్ల ఎలాంటి దగ్గు అయినా సరే ఇట్టే తరిమేయవచ్చు అంటున్నారు డాక్టర్ బీ ఎన్ సిన్హా.. ఈయన సూచించిన ప్రకారం ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు, అర టేబుల్ స్పూన్ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసుకొని తాగడం వల్ల గొంతు సమస్యలు క్లియర్ అవుతాయి అని చెప్పుకొచ్చారు. దగ్గు మరీ ఎక్కువగా వేధిస్తుంటే గ్లాసు పాలలో పసుపు తో పాటు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా లవంగం వేసుకొని కూడా తాగవచ్చు. వెల్లుల్లి వాసన పడనివారు వెల్లుల్లికి ప్రత్యామ్నాయంగా అల్లం ను వేసుకొని త్రాగవచ్చు.
దానితోపాటు గోరువెచ్చని పాలలో,పసుపు వేసుకొని పుక్కలించడం మరీ మంచిది. అలాగే రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుక్కిలించండి వల్ల కూడా మంచి ఉపశమనం కలుగుతుంది..పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల ఏజెంట్ ఉంటుంది. ఇది బలమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఇన్ఫెక్షన్లను రాకుండా చేయడమే కాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్లు వస్తే చికిత్సకు సహాయపడుతుంది.
అల్లం, వెల్లుల్లి గొంతులోని గరగరను తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో పాటు సహజ అనాల్జెసిక్‌లుగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు తాగడం వలన వేడి పాలు మీ ఛాతీ నుండి శ్లేష్మం పైకి రావడానికి సహాయపడుతుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు పసుపు పాలు తాగడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఎలాంటి దగ్గు నుంచైనా విముక్తి పొందవచ్చు...