వేసవిలో చెమటకాయలు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..?
అయితే వేసవికాలంలో ప్రతి ఒక్కరిని ఎక్కువగా వేధించే సమస్య ఎక్కువగా చెమట పట్టడం ఎక్కువగా చెమట పట్టడం ద్వారా చెమటకాయ వచ్చి ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెమటకాయ పట్టిన భాగంలో ఇక ఎక్కువగా మండుతూ ఉండటం లేదా దురద వేస్తూ ఉండటం ద్వారా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలా వేసవి కాలంలో వచ్చే చెమట కాయలు దూరం చేసుకోవడానికి మా ప్రోడక్ట్ వాడండి అంటూ ఎన్నో రకాల ప్రొడక్ట్ లు మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే చెమటకాయ తో బాధపడుతున్న వారు ఏ ప్రోడక్ట్ వాడాలో తెలియక అయోమయంలో పడి పోతూ ఉంటారు.
చెమట కాయకు చెక్ పెట్టాలి అంటే మార్కెట్లో దొరికే వస్తువుల కంటే వంటింటి చిట్కాలు ఎక్కువగా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు నిపుణులు. వెనిగర్ బ్లాక్ టీ లేదా లవంగా నూనె లో ఏదో ఒకటి తీసుకుని దానిని చెమటకాయలు ఉన్న చోట్ల ఒక కాటన్ బాల్ తో తీసుకుని రాస్తే అవి తగ్గి పోతాయట అంతేకాకుండా రోజ్ వాటర్ గంధం రెండు మిశ్రమంగా కలిపి చెమటకాయలు ఉన్నచోట రాసి కడుక్కుంటే మంచి ఉపశమనం ఉంటుందట. అంతేకాకుండా మజ్జిగ సబ్జా నీళ్లు బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చట.