కొత్తగా పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో కరోనా ఉధృతి....ఎన్ని కేసులో తెలిస్తే షాకవుతారు..!
భారత్‌లో శనివారం వరకు 24 గంటల వ్యవధిలో నిర్వహించిన పరీక్షల్లో 40,953 మందిలో పాజిటివ్ తేలిందని, 188 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1.1 కోట్లకు చేరింది. చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా 1.6 లక్షలకు పెరిగింది. 10 రోజులుగా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. మూడు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గురువారం 35,871, శుక్రవారం 39,726 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల సంఖ్య 111 రోజుల్లోనే అత్యధికం. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది.
తాజాగా రికార్డు స్థాయిలో 25,681 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 3,063 కేసులు ముంబయిలోని బయటపడ్డాయి. కరోనా ఉధృతిపై సిఎం ఉద్దవ్ థాకరే నందర్బార్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులు చాలా భయంకరంగా మారుతున్నాయని, రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం అనే ఆప్షన్‌పై ఆలోచిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోమారు విస్తరిస్తోంది. శనివారం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా భోపాల్‌లోని ఇండోర్‌లో కరోనా బారినపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతంలో తిరిగి లాక్‌డౌన్ విధించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానిక మార్కెట్‌లోని వారికి మాస్కులు పంపిణీ చేయడం గమనార్హం.