కాఫీ తాగితే నిద్ర ఎందుకు రాదో తెలుసా..?
సాధారణంగా మనం తాగే టీ లేదా కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినదే. అదేవిధంగా మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ(సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది.పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర రాకుండా ఎంతో చురుగ్గా మన పని చేసుకోగల్గుతాము. అయితే కెఫిన్ ప్రతిరోజు కేవలం 400 మిల్లీ గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక సమస్యలు వెంటాడే అవకాశం ఉంది.
కాఫీ లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.మనం కాఫీ ,టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ టీ లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు మనం అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు.