మొక్కజొన్న ను గర్భిణీలు తినవచ్చా...? తింటే ఏమవుతుంది...!

kalpana
 గర్భం ధరించిన అప్పటినుండి డెలివరీ అయ్యేంతవరకు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ తప్పు జరిగినా పుట్టబోయే బిడ్డకి ప్రమాదం అవుతుంది. అందుకే డాక్టర్ల  సలహా మేరకు వారు సూచించిన ఆహార పట్టికను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేయడంవల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో చాలా మంచి జరుగుతుంది. అటువంటివాటిలో మొక్కజొన్న కూడా ఒకటి. కానీ చాలామంది మొక్కజొన్న తింటే కడుపునొప్పి వస్తుందని అనుకుంటారు. అందుకే దానిని తినకుండా ఉంటారు. కానీ మొక్కజొన్న తినడం గర్భిణీలకు చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో చాలా మంది రక్తహీనతతో బాధ పడుతుంటారు. జరగకుండా ఉండడానికి ఐరన్, పోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అందుకే గర్భధారణ సమయంలో మొక్కజొన్న తినడం వల్ల రక్త  హీనత  సమస్య రాకుండా ఉంటుంది.
 మొక్కజొన్న లను  తీసుకోవడం వల్ల మలబద్దక  సమస్య కూడా ఉండదు. మొక్కజొన్న లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఒక్కోసారి  డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా  డయాబెటిస్ రాకుండా ఉండడానికి మొక్కజొన్న ఎంతో దోహదపడుతుంది. కాబట్టి గర్భిణీలు మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిది.
 గర్భిణీలు కాకుండా ఎవరైనా మొక్కజొన్నను తినవచ్చు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొక్కజొన్న లో యాక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి.
 ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మొక్కజొన్న లో అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా మెగ్నీషియం, కాపర్, ఐరన్, పాస్పరస్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 మొక్కజొన్నను  ప్రతి రోజు తినడం వల్ల ఆకలి ఎక్కువగా రాలిపోకుండా వాటికి బలాన్ని ఇస్తుంది. ఇందులో  విటమిన్ సి అధికంగా  ఉంటుంది. ఇది వెంట్రుకలను స్మూత్ గా  ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: