కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోండి...
కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నప్పుడు అల్లం తో టి తీసుకొని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పొలం లో ఉండే ఔషధ గుణాల వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తగ్గుతాయి. రోజువారి ఆహారంలో అల్లం చేసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, వికారం, వాంతులు తగ్గుతాయి.
కీళ్ల నొప్పులకు ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కీళ్ళల్లో పేరుకుపోయిన స్పటికలను లను కరిగించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అర్థరైటిస్ మరియు కీళ్లనొప్పులను త్వరగా నయం అవుతాయి.
పాలలో కొంచెం పసుపు కలిపి తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. పసుపు ఇంకా అనేక అనారోగ్యాలను నయం చేస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు బచ్చలి కూర ను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న తగ్గుముఖం పడతాయి. అలాగే బచ్చలకూర తినడం వల్ల కీళ్లు ఎక్కువ రోజులో ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.