నిమ్మకాయ పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..?
అయితే, నిలువ ఉంచే పచ్చళ్లు ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు చాలామంది వాదిస్తున్నారు. మరి తరతరాలుగా ఊరగాయాలను తింటూ పెరిగిన మన పూర్వికులు హెల్తీగా ఎలా ఉండేవారనే ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ దీనిపై స్పందిస్తూ పచ్చళ్లు ఆరోగ్యానికి కీడు చేస్తాయనడం కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్‌కు కారణమవుతాయి. ఇవి రెండు ఆరోగ్యానికి ప్రమాదకరమే. అయితే, రోజూ కాసింత నిమ్మ పచ్చడిని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవ్వుతుంది.
ఎందుకంటే నిమ్మలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్సియంలు ఉంటాయి.వయస్సు పెరిగే కొద్ది ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ లోపం వల్లే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి కాల్షియం, విటమిన్-సి, ఎ, పొటాషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది: వైరస్ల వల్ల మనకు రోగ నిరోధక శక్తిపై శ్రద్ధ బాగా పెరిగింది. అయితే, సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోడానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ పచ్చడి కూడా ఒకటి. ఇందులో కాంప్లెక్స్-బి విటమిన్లు ఉన్నాయి
నిమ్మ పచ్చడిలో ఫ్యాట్, కొవ్వులు అస్సలు ఉండవు. కాబట్టి దీన్ని మీరు డైట్లో చేర్చుకున్న పెద్ద సమస్య ఉండదు. కాబట్టి.. మీరు ఈ పచ్చడిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడితో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైమ్‌లు శరీరంలోని విషతుల్యాలను తొలగించేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మొటిమలను తగ్గించడం, బరువు తగ్గించేందుకు ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.