పారిజాతం మొక్కలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...?
పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అలాగే గొంతు వాపును తగ్గిస్తుంది. అనేక వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. అంతేకాకుండా గొంతు కండరాలు మృదువుగా ఉంచుతుంది.
పారిజాత మొక్క జ్వరాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
మలేరియా జ్వరం తో బాధ పడుతున్న వాళ్ళు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వల్ల మలేరియా జ్వరం ను తగ్గిస్తుంది. అంతేకాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఒత్తిడి మరియు ఆందోళన తగ్గడానికి పారిజాతం నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మెదడులోని సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.
వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా ను పెరగకుండా చేస్తుంది. దీనివల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి.
చర్మ సమస్యలు రాకుండా పారిజాతం మొక్క బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలను పోగొడుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది.
పారిజాత ఆకులను కషాయంగా చేసుకొని తాగడం వల్ల కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి. అందుకే ఎక్కువగా పారిజాత మొక్క ను ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది. పారిజాత పువ్వులను కాషాయం గా తీసుకొని తాగడం వల్ల చక్కెర వ్యాధి నివారణ అవుతుంది.
పారిజాత విత్తనాలను కాషాయం గా చేసుకొని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా, తలలో ఉండే పేల్లు కూడా నశిస్తాయి.