కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించండి...!
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి కావలసిన మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తగినంత విశ్రాంతి, రక్షణ కళ్ళకు చాలా అవసరం. ఈ విధంగా చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
కళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఎండలో స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి.
కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, క్యారెట్ జ్యూస్ లో కలిపి అంతే మోతాదులో కలుపుకొని తాగడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
కళ్ళకు ఆముదము నూనె చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మూడు చుక్కలు ఆముదము నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళ పోయి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పుచ్చకాయ, టమోటా, పాలు, ద్రాక్ష వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు ఉండవు.
కంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి జామ, ఆరెంజ్, పైనాపిల్, గ్రీన్ చిల్లి, రెడ్ చిల్లి, బెల్ పెప్పర్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలను తొలగించడమే కాకుండా, కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనబడటానికి ఉపయోగపడతాయి.