తియ్యగా ఉందని అతిగా తిన్నారో ఇక అంతే..!

Divya

ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక జంక్ ఫుడ్డు లేనిదే ఆరోజు వారికి కడుపు నిండదు. ఈ జంక్ ఫుడ్ లో మరీ ముఖ్యంగా టొమాటో  సాస్ ను వేసుకొని అతిగా తినేస్తూ ఉంటారు. ఎలాంటి స్నాక్ ఐటం తినాలన్నా సరే తప్పకుండా పక్కన ఈ టొమాటో సాస్ ఉండి తీరాల్సిందే.. అయితే ఈ టొమాటో సాస్ తియ్యగా ఉందని చిన్న పిల్లలు సైతం అతిగా తినేస్తుంటారు.. అయితే ఈ టొమాటో సాస్ ను అతిగా తింటే, ఎన్నో విపరీతమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ టొమాటో సాస్ వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


టొమాటో లతో టొమాటో సాస్ ను తయారు చేయడానికి కేవలం టొమాటోలను మాత్రమే ఉపయోగించరు. వీటి తయారీ కోసం ఉప్పు, చక్కెర,ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కారం వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా  టొమాటో సాస్ ఎర్రగా రావడానికి ఫుడ్ కలర్ ను ఉపయోగిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని చాలా మందికి తెలియదు. అయితే సాస్ కు రుచి,చిక్కదనం, తియ్యదనం కోసం ఇవన్నీ వాడడం వల్ల బీపీ,షుగర్ ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం అని వైద్యులు సూచిస్తున్నారు.


ఇక టొమాటో సాస్ కు చిక్కదనం కోసం టొమాటో గుజ్జు కు బదులు బొప్పాయి పండ్ల పిప్పిని ఉపయోగిస్తున్నారు.  వీటిని తినడం వల్ల ఆరోగ్యవంతులకు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. టొమాటో సాస్ లో కలిపే ఫుడ్ కలర్ వల్ల ఎంతో మందికి అలర్జీలు కూడా వస్తున్నాయి. టొమాటో సాస్ లో మరీ ముఖ్యంగా హై ఫ్ర‌క్టోజ్ కార్న్ సిర‌ప్ ను ఉప‌యోగిస్తారు. అందులోని హానికరమైన కెమికల్స్ వ‌ల్ల ర‌క‌ర‌కాల అనారోగ్యాలు క‌లుగుతాయి.


ఈ టొమాటోలను  సాస్‌గా మార్చ‌డంవ‌ల్ల వాటిలో స‌హ‌జంగా ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి, ఫైబర్ లాంటి ఎన్నో ముఖ్యమైన  పోషక గుణాలు న‌శించిపోతాయి. అందుచేత‌ టొమాటో లు తీసుకోవ‌డంవ‌ల్ల స‌హ‌జ‌కంగా ల‌భించే పోష‌కాలు కూడా ఈ సాస్ ద్వారా ల‌భించ‌వు. ఫలితంగా దీర్ఘకాలిక సమస్యలు అయిన  ఊబకాయం, ఆస్త‌మా, వివిధ ర‌కాల ఎల‌ర్జీలు, బీపీ, షుగ‌ర్ లాంటి స‌మ‌స్య‌లు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా ముందుగానే ఇలాంటి జబ్బులతో బాధ పెడుతున్న  వాళ్లు సాస్‌ల‌ జోలికి వెళ్లకపోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: