వేరు శనగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,ఉన్నాయో మీకు తెలుసా...?

kalpana
వేరుశెనగ లను పల్లీలు అని కూడా అంటారు. ఈ పల్లీల ను అనేక రకాల వంటల్లో వాడుతుంటారు. పల్లీలతో కారం పొడి కూడా తయారుచేసుకుని చేసుకొని అన్నంలోకి, చపాతీలోకి, దోసెల్లోకి తింటాము. అంతేకాకుండా వేరుశెనగ లను ఉడకబెట్టి తింటారు. వేయించి కూడా తినవచ్చు. ఎలా తీసుకున్నా వేరుశెనగలు చాలా రుచిగా ఉంటాయి.బెల్లం, వేరుశెనగలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పల్లీలు ధర కూడా అందుబాటులో ఉంటుంది. బాదం పప్పు,  జీడిపప్పు వీటి ధర కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండే పల్లీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం...

 పల్లీల లో యాంటీ యాక్సిడెంట్లు, మాంగనీస్ ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.

 మలబద్దక సమస్యతో  బాధపడుతున్న వాళ్లు వేరుశెనగ లను ఉడికించి తీసుకోవడం వల్ల మలబద్దక  సమస్య తీరుతుంది. ఎందుకంటే వేరుశెనగ లో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మధుమేహ వ్యాధి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

 బెల్లం, శనగపప్పును కలిపి పిల్లలకు తినిపిస్తే హుషారుగా ఉంటారు. అంతేకాకుండా చర్మం మృదువుగా ఉంటుంది.చర్మంపై ఉండే మచ్చలని కూడా కలిగిస్తుంది.

 రోజు క్రమం తప్పకుండా వేరుశెనగ ను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే రొమ్ము క్యాన్సర్ నుండి బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

పల్లీల లో విటమిన్ బి 3, నియాసిన్ అధికంగా ఉండటం వల్ల చర్మం ముడుతలు పడకుండా కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.

 వేరుశనగ లను షుగర్తో బాధపడుతున్న వాళ్లు స్నాక్ రూపంలో తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.వేరుశెనగ లో ఉంటే మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.

 గుప్పెడు వేరుశెనగలు కొంచెం బెల్లం కలిపి తినడం వల్ల రక్తం శుద్ధి అవడమే కాకుండా,రక్తహీనత సమస్యలు కూడా నివారిస్తుంది.అలాగే రక్తాన్ని వృద్ధి చేస్తుంది.

 వేరుశెనగ లో తక్కువ కేలరీలు ఉంటాయి. వేయించిన వేరుశనగ కంటే, ఉడికించిన వేరుశనగ లో తక్కువ కేలరీలు ఉంటాయి.ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. కాకుండా ఎక్కువ పోషకాలు కూడా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: