మెడనొప్పితో బాధపడుతున్నారా? అయితే మెడ దగ్గర ఈ పాయింట్స్ వద్ద మసాజ్ చెయ్యండి...
ఇక మెడ నొప్పి తగ్గడానికి ఈ విధంగా మసాజ్ చెయ్యండి.మెడ దగ్గర రెండు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అవి రెండింటినీ కలిపి హెవెన్లీ పిల్లర్ అంటారు. ఒక పాయింట్ స్కల్ బేస్ నుండి ఒక బొటన వేలు దూరంలో ఉంటుంది, రెండవ పాయింట్ అప్పర్ నెక్ వద్ద సెంటర్ ఆఫ్ స్పైన్ నుండి ఒక బొటన వేలు దూరంలో ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ మధ్య రెండు, మూడు సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఈ పాయింట్ థైరాయిడ్ గ్లాండ్కి హెల్ప్ చేసి హార్మోనల్ బాలెన్స్ కి సహకరిస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల నిద్ర పట్టకపోవడం, తల బరువుగా ఉండడం, మెడ పట్టేసినట్లు ఉండడం, ఒత్తిడి, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి. ఈ పాయింట్స్ దగ్గర ఎవరికి వారు ప్రెషర్ అప్లై చేయటం కంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం వల్ల బెస్ట్ స్టిమ్యులేషన్ జరుగుతుంది.
ఇంకా మరొక మసాజ్ పాయింట్ షోల్డర్ వెల్. ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ ఆక్యు ప్రెషర్ పాయింట్. ఈ పాయింట్ మెడ మొదలు నుండీ రెండు వేళ్ళ దూరం లో ఉంటుంది. అంటే షుమారుగా మెడ, భుజాలూ మొదలయ్యే ప్లేసెస్ కి మధ్యలో ఉంటుంది. సెర్వికల్ మజిల్స్ లో ఉండే టెన్షన్ ఎక్కువగా ఈ పాయింట్ దగ్గరే కాన్సంట్రేట్ అయి ఉంటుంది. ఈ పాయింట్ ని మృదువుగా, గుండ్రంగా మసాజ్ చేయడం వల్ల రిలీఫ్ లభిస్తుంది. అయితే, గర్భవతుల్లో ఈ పాయింట్ ని స్టిమ్యులేట్ చేయకూడదు. అది తల్లికీ, బిడ్డకీ కూడా మంచిది కాదు.ఇక ఇవి బాగా తెలిస్తేనే చెయ్యండి. జాగ్రత్తగా చెయ్యండి..