ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్ ను తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా?
గోధుమ గడ్డి జ్యూస్ ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. గోధుమ గడ్డి లో క్లోరోఫిల్ అధికంగా ఉండటం వల్ల చెడు బ్యాక్టీరియాను నివారించి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో గోధుమ గడ్డి పొడి రూపంలో కానీ టాబ్లెట్ల రూపంలో గాని లభిస్తోంది. అయితే గోధుమ గడ్డిని జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. గోధుమ గడ్డి ని మన ఇంట్లోనే ఈజీ గా పెంచుకోవచ్చు.
మొదట గోధుమలను నానబెట్టి, ఒక వెడల్పాటి ట్రేలో మట్టి నింపి అందులో నాన బెట్టిన గోధుమలను సమానంగా చల్లాలి. ఆ ట్రైనింగ్ గాలి , వెలుతురు తగిలే చోట ఉంచి రోజు నీళ్లు పోస్తూ ఉంటే పది రోజుల తర్వాత గోధుమ గడ్డి 6 లేదా 7 అంగుళాలు పెరుగుతుంది. దాన్ని కత్తిరించు కొని గోధుమ గడ్డి జ్యూస్ గ వాడుకోవచ్చు.
గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
గోధుమ గడ్డి లో పోలిక్ యాసిడ్ , ఐరన్, బీ12, సమృద్ధిగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెంది రక్తహీనత సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బేటా కరోటిన్, బయో ఫ్లావో నాయిడ్, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్ కణాలను నశింపచేస్తుంది.
ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే గోధుమ గడ్డి జ్యూస్ ను 30 ml కంటే ఎక్కువగా తీసుకోరాదు . ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది.