ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!
ఈ పరిశోధనలో ఓ షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేసిన తరువాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. అయితే హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ముందు వారి చేతి వేళ్లలో కొన్ని మార్పులు వస్తాయని, వాటిని బట్టే ఆ వ్యక్తి గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉందా లేదా అని గుర్తించవచ్చని తెలిపారు.
అందులో మొదటిది.. చూపుడు వేలు, ఉంగరం వేలు రెండూ సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా అరుదట. అయితే ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అంతేకాదు 35 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు గలవారికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇక స్థూలకాయం ఉన్నవారు, చిరుతిళ్లు ఎక్కువగా తినేవారికి, ఒత్తిడి అధికంగా ఉన్నవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అందువల్ల ఒత్తిడిని దరిచేరనీయకుండా, చిరుతిళ్లకు దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు.
హార్ట్ ఎటాక్ సమస్యను శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి కూడా గుర్తించవచ్చట. శ్వాస సరిగా ఆడకపోవడం, గాలి పీల్చుకోవడంలో తరచుగా ఇబ్బందులు ఎదురవుతుండడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తాయని చెబుతున్నారు. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లు నెప్పులు దీర్ఘ కాలం బాధపెడుతుండడం, మత్తుగా నిద్రవస్తున్నట్లుండడం, అధికంగా చెమటలు పడుతుండడం వంటి లక్షణాలన్నీ గుండెపోటు లక్షణాలేనని, వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇక పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయని, వీలైనంత వరకు ఈ అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిదని, కనీసం తగ్గించుకునేందుకైనా ప్రయత్నించడం అవసరమని సూచిస్తున్నారు.