గ్రీన్ టీతో డయాబెటిస్ సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కుంటున్న సమస్య డయాబెటిస్. ప్రపంచంలో 100 కి 70 శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక డయాబెటిస్ తగ్గడానికి లేదా కంట్రోల్ లో వుంచుకోవడానికి చాలా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే డయాబెటిస్ సమస్యని గ్రీన్ తో నయం చేసుకోవచ్చు. డయాబెటిస్ పేషెంట్లకి గ్రీన్ టీ చక్కని పానీయం. గ్రీన్ టీలో   తియ్యని, తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్ ఫ్లెవనాయిడ్స్  నిండి ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.

గ్రీన్ టీ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు మరియు ఫాస్టన్గ్ ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ రెండిటిపైనే డయాబెటిక్ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు ప్రధానంగా పాలీఫెనాల్స్ మరియు పాలిసాకరైడ్ల యొక్క యాంటీఆక్సిడెంట్ యాక్టీవిటీ. ఈ రెండు యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి.కానీ మీరు గ్రీన్ టీ తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇందులో తక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది.

మీరు రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తీసుకోవచ్చు.గ్రీన్ టీ లో పంచదారను కలపవద్దు. చెక్కెర కలపని గ్రీన్ టీ మరింత ఆరోగ్యకరమైనది. గ్రీన్ టీ బాగా రుచిగా ఉండటానికి మీరు కొంచెం నిమ్మరసం లేదా కొన్ని పుదీనా ఆకులను వేసుకోవచ్చు.గ్రీన్ టీ ని కలిపినా తరువాత 2-3 నిముషాల కంటే ఎక్కువ సేపు ఉంచవద్దు. ఆలా ఉంచితే గ్రీన్ టీ చేదు వస్తుంది. అంతేకాకుండా, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి టీ బాగ్స్ కి బదులుగా బయట దొరికే గ్రీన్ టీ పొడిని ఉపయోగించండి.గ్రీన్ టీ, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదని మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది.

 ఒక రోజులో ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగిన వ్యక్తులకు ఇతరులతో పోలిస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 33 శాతం తక్కువ. కానీ గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు దీనికి మాత్రమే పరిమితం కాదు. మరొక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది మరియు లక్షణాలను తీవ్రతరం అవ్వకుండా నిరోధిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: