డయాలసిస్ తరువాత పాటిచాల్సిన ఆహార పద్ధతులు..

Purushottham Vinay
డయాలసిస్ తరువాత పాటించాల్సిన ఆహార పద్ధతులను ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి..  ఉప్పు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోండి. సోడియం దాహాన్ని పెంచుతుంది దాంతో ఎక్కువగా ద్రవ్యాలు తాగాల్సి వస్తుంది. ఆహారంలో రుచిని పెంచడం కోసం తాజా మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు లేదా నిమ్మరసం ఉపయోగించండి.

రక్తంలో పొటాషియం సురక్షితమైన స్థాయిలో నియంత్రించబడాలి. ఈ  పొటాషియం స్థాయిలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఇది కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది.పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం, ఎముక ఆధారిత సూప్‌లు, బీన్స్ మరియు కోకో ఆధారిత ఉత్పత్తులు వంటి అధిక ఫాస్ఫేట్ ఆహారాలకు దూరంగా ఉండాలి.గుడ్లు, సోయా, పౌల్ట్రీ లేదా మాంసం, కాయధాన్యాలు మరియు చేపలు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన భోజనం తినండి.

 డయాలసిస్ రోగులు మూత్ర విసర్జనను తగ్గించడం వలన, శరీరంలో అధిక ద్రవం నిలుపుకోవడం వల్ల ఊపిరి అందకపోవడం, కాళ్ళలో వాపు మరియు హై బిపి వస్తుంది. రోజు నడవటం అలవాటు చేసుకోండి. తగినంత సమయం నిద్రపోండి. సమయానికి మందులు వేసుకోండి.ధ్యానం కూడా ఆరోగ్యానికి మంచిది. మీ శ్వాసపై దృష్టి పెట్టడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


మీ రోజువారీ మందుల మోతాదును కరెక్ట్ గ వేసుకుంటున్నారో తెలుసుకోవడానికి పిల్ ఆర్గనైజర్ ను, రోజువారీ చెక్‌లిస్ట్ ను ఉపయోగించండి. మందులు మరిచి పోకుండా వేసుకోవడం కోసం టైంకి అలారం సెట్ చేసుకోండి. దాని వల్ల ఏ డోస్ ను మరిచిపోరు. ఎల్లప్పుడూ మీ నెఫ్రోలాజిస్ట్‌తో కాంటాక్ట్ లో ఉండండి.
అనవసరమైన ఒత్తిడిని నివారించడం మంచిది. మీ వైద్యుడి సలహా వినండి. మీకు ఏమైనా భయాలు, టెన్షన్స్ ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించుకోండి.  అంతే కానీ మనసులోనే పెట్టుకుని ఆందోళన పడవద్దు.

కాబట్టి ఈ పద్ధతులు కచ్చితంగా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: