గర్భిణీలు కాకరకాయ తినొచ్చా...? తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?

Hareesh
హైదరాబాద్ : చేదుగా ఉండే కాకరకాయ ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. చేదుగా ఉన్నా విలువైన పోషకాలుంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినాలని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయం మహిళలకు చాలా ముఖ్యం. అయితే  ఆ సమయంలో గర్భిణీలు కాకరకాయ తినొచ్చా అనే సందేహం చాల మందిలో ఉన్నది.

అది ఎంత మాత్రం వాస్తవం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మంచి పౌష్టికాహారం తీసుకున్నప్పుడే  శిశువు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది.  గర్భిణీ సమయంలో జీర్ణసంబంధిత సమస్యలు రావడం సాధారణ విషయమే. గర్భాశయ విస్తరణ, స్టెనోసిస్, విరేచనాలు మరియు కడుపు నొప్పి వంటి శరీరంలోని వివిధ హార్మోన్లు, స్రావాలలో తీవ్రమైన హెచ్చు తగ్గులు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు. కాబట్టి కాకరకాయలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉన్నందున జీర్ణక్రియకు కూడా మంచిది.

చిన్న అనారోగ్యాలు కూడా గర్భధారణ సమయంలో పెద్ద సమస్యగా ఉంటాయి. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తాయి. అందువల్ల గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మీ డైట్‌లో కాకరకాయ చేర్చి ఇబ్బందికరమైన సమస్యలను నివారించి గర్భం మాధుర్యాన్ని ఆస్వాదించండి. కాకరకాయలో విటమిన్ "సి "పుష్కలంగా ఉంటుంది. విటమిన్" సి "సాధారణ రోగాలతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో మలబద్ధకం ఒకటి. కాకరకాయలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటిలో ఎక్కువ భాగం పై తొక్కలో ఉంటుంది. కానీ చాలామంది ఫై తొక్క తీసేసి వండుకుంటారు. కాబట్టి ఫై తొక్క తీయకుండా వండుకోవాలి. మలబద్ధకం సమస్యను నివారించడానికి ఫైబర్ అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: