షుగర్ వ్యాధికి చెక్ పెట్టండి ఇలా... !!!!

Purushottham Vinay
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్ద వాళ్ళు. మనం ఎంత ఆరోగ్యాంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా సాగుతుంది. ఈ రోజుల్లో కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటంటే మధుమేహం. మధుమెహంతో ఈ రోజుల్లో  చాలా మంది జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిన విషయమే.  అసలు ఈ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకనే ముందు నుంచే ఈ వ్యాధి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మధుమెహం రాకుండా జాగ్రత్తలు కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పోస్ట్ మీ కోసం... చూడండి!
మధుమేహం వస్తుందనే ఆందోళన మిమల్ని వెంటాడుతోందా? అయితే, ఇలా చేయండి.
డయాబెటిస్ (మధుమేహం లేదా షుగర్). ఈ వ్యాధి ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా సోకుతోంది. ఒకప్పుడు వంశపారంపర్యంగా వ్యాధి సోకేది. కానీ, ఇప్పుటి ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, మారిన జీవనశైలి వల్ల.. ఈ వ్యాధి ముందుగానే పలకరిస్తోంది.వాల్‌నట్స్‌తో మధుమేహానికి చెక్ చెప్పొచ్చా? ఎలా తీసుకోవాలి?
సాధారణంగా మన దేశానికి డయాబెటిస్ బారిన పడే ముప్పు ఎక్కువ. ఇది సోకిన తర్వాత జీవితాంతం తీపికి దూరంగా ఉండాల్సిందే. ఆహారాన్ని కూడా సమాయానికి తీసుకోవాలి. లేకపోత.. శరీరానికి ఇన్సులిన్ అందక అస్వస్థతకు గురవ్వుతారు. అలాగే శరీరంలో ఇన్సులిన్ మోతాదు, చక్కెర స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
అయితే, రోజూ వాల్‌నట్స్‌ను ఆహారంగా తీసుకోవడం డయాబెటిస్ టైప్-2 బారిన పడే ముప్పు సగానికి తగ్గుతుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. రోజూ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాల్‌నట్ తీసుకునే వాళ్లతో పోలిస్తే 3 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినేవాళ్లలో మధుమేహం ముప్పు 47 శాతం తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.
ఇలా తీసుకోండి: రోజుకు 28 గ్రాములు లేదా 4 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినడం వల్ల చక్కని ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వాల్‌నట్స్ తినడం అలవాటు చేసుకోండి. అంతేకాదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని మహమ్మారిని దరిచేరనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: