రోగ నిరోధక శక్తి కి ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి.. !!!!

Purushottham Vinay
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపాదించిన ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సుఖమయం అవుతుంది.ఎంత సంపాదించిన ఆరోగ్యం గా లేకపోతే ఎంత సంపాదించిన వృధా. చాలా మంది చాలా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు.ఈ చిట్కాలు పాటించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  ఇండియా హెరాల్డ్. కామ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో కొన్ని రోగ నిరోధక శక్తి కి  సంబంధించిన  చిట్కాలు చదవండి. తప్పకుండా పాటించండి. అనేక సమస్యలు నుంచి విముక్తి పొందండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

ఆరోగ్యాంగా ఉండాలంటే మనం పెద్ద పెద్ద చిట్కాలే పాటించాల్సిన పని లేదు. రోజు ఎక్కువగా నీళ్లు తాగండి. ఎందుకంటే ప్రతి రోజు మంచి నీరు ఎక్కువగా తాగడం వలన వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఎన్ని ఎక్కువ సార్లు నీరు తాగితే అంత మంచిది. అన్నం తిన్నాక కనీసం ఒక రెండు గ్లాసులు నీరు తాగడం వలన జీర్ణ శక్తి బాగా అవుతుంది. అలాగే పొద్దున్నే లేచి చల్లటి నీటితో మన కళ్ళు, ముఖముమును శుభ్రపరుచుకోవడం వలన మన కళ్ళలో వుండే దుమ్ము, దూళి అన్ని పోతాయి. ఇంకా కళ్ల సమస్యలు రావు. అలాగే నీటిని కాగా పెట్టుకొని తాగడం వలన చాలా ఆరోగ్యాంగా ఉంటారు. అలా కాగా పెట్టుకోవటం వలన నీటిలో వుండే బాక్టీరియా వంటివి చనిపోతాయి.

ఎరుపు గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆహారాలు రోగ నిరోధక వ్యవస్థ యొక్క వివిధ భాగాల పని తీరుని మెరుగు పరుస్తాయి. శరీరం కోల్పోయిన యాంటీ యాక్సిడెంట్స్ తిరిగి ఏర్పరడానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడి గుడ్లు, మాంసం లతో పాటు, సీ ఫుడ్ లో కూడా జింక్ లభిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. జీలకర్ర లో వున్న ఫాలీ ఫెనోల్స్ అనే పదార్ధం కారణంగా ఈ మసాలా దినుసు యాంటీ యాక్సిడెంట్ గా పని చేస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే అరటిపండు, ఆప్రికాట్ పండ్ల లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి నిత్యం వీటిని తీసుకోవడం వలన అధిక రక్తపోటుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది. లవంగాలలో విటమిన్ సి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అలాగే పుచ్చకాయ చాలా మంచిది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ రోజు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: