పళ్ళు ఆరోగ్యాంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి... !!!!!

Purushottham Vinay
కొంతమంది ఎంత ఆరోగ్యం గా, అందం గా వున్న వారి పళ్ళు ఆరోగ్యం గా వుండవు. ఈ పళ్ళు ఎలా ఆరోగ్యం గా ఉంచుకోవాలి, జాగ్రత్తలు, చిట్కాలు గురించి ఇండియా హెరాల్డ్. కామ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి. పాటించండి. తప్పకుండ మంచి ఫలితం ఉంటుంది.

ఇక విషయానికి వస్తే చాలా మంది అనేక పళ్ళ సమస్యలతో బాధ పడుతూ వుంటారు. చిగుళ్ల నొప్పి, వంకర పళ్ళు, ఎత్తుపళ్లు, గార పళ్ళు తో ఇలా అనేక రకాల పళ్ళ సమస్యలతో బాధ పడుతూ వుంటారు. అల పళ్ళ సమస్యలు లేకుండా పళ్ళు తెల్లగా, నిగ నిగ లాడుతూ ఉండటం కోసం ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

ఈ పళ్ళ సమస్యలను తగ్గించుకోవడానికి మనం పెద్ద పెద్ద హాస్పటల్ ల చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉంటూ, మన ఇంట్లో వుండే పదార్ధాలతో ఎలాంటి పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.

పళ్ళు తెల్లబడాలంటే 1/4 టీ స్పూన్ పసుపులో కొన్ని  రోజ్ వాటర్ చుక్కలు కలుపుకోవాలి, ఈ మిశ్రమాన్ని బ్రష్ తో పళ్ళుతోముకోవాలి. రోజు అలా చెయ్యటం వలన పళ్ళు తెల్లబడటమే కాదు, పళ్ళ మీద గార వున్న పోతుంది.

ఒక ముక్క బొప్పాయి పండు తీసుకొని మెత్తగా చిదిమి పేస్టు లాగా చేసుకొని బ్రష్ తో పళ్ళు తోముకొండి. బొప్పాయి లో ని ఎంజైములు పళ్ళు తెల్లగా అవ్వడానికి సహాయ పడతాయి.

అలాగే అరటి తొక్కలోని తెలుపు భాగం తో మీ పళ్ళని బ్రష్ చేసుకోండి. అరటి తొక్కలోని పొటాషియం పళ్ళు సహజంగా తెల్లబటానికి దోహదపడతాయి.

అలాగే చాలా మంది గంటలకు పైగా బ్రష్ చేస్తారు. అలా చెయ్యడం వలన చిగుర్లు గాయపడి దంత సమస్యలు వస్తాయి. అలాగే నైట్ బ్రష్ చేసాక కొబ్బరి నూనెతో పళ్ళను శుభ్రం చేసుకోండి. అలా చెయ్యటం వలన పళ్ళ సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: