ఆరోగ్యం: థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే సింపుల్ & ఎఫెక్టివ్ టిప్స్!!
అయితే డైట్‌లోని చిన్న చిన్న మార్పులతో, న్యూట్రిషన్ అలాగే లైఫ్ స్టైల్ ఛేంజెస్‌తో థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ద్రవపదార్థాలు అంటే.. మజ్జిగ, పండ్ల రసాలు, సూప్‌లు, రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా కొందరిలో సహజంగా అయోడిన్ ఉత్పన్నం కాదు. అందువల్ల అయోడిన్ బాగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే.. అయోడైజ్డ్ ఉప్పు తింటే థైరాయిడ్ సమస్యల్ని ఎదుర్కోవొచ్చు. అలాగే థైరాయిడ్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ అర కప్పు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే.. పెరుగులో వుండే విటమిన్ డి, ప్రొబయోటిక్స్ థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి.
జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిముఖం పడతాయి. ఇక తాజా ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, ఆమ్లజనకాలు, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే చేపలు కూడా తరచూ తింటూ ఉండాలి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలు ఇవ్వడంతో పాటు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. అయితే ముఖ్య విషయం ఏంటంటే.. థైరాయిడ్ సమస్యలకి మెడికేషన్స్ ను వాడేటట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, కొన్ని మెడికేషన్స్ ను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే వేసుకుంటే థైరాయిడ్ టాబ్లెట్స్ సరిగ్గా పనిచేయవు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.