ఆరోగ్యం: క్యాప్సికమ్ తింటున్నారా? లేకుంటే ఇవి తెలుసుకోండి!!
క్యాప్సికమ్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటినే బెంగుళూర్ మిర్చి అని కూడా పిలుస్తుంటారు. రంగురంగుల్లో లభించే క్యాప్సికమ్‌తో అనేక రకాల వంటలు తయారు చేస్తారు. క్యాప్సికమ్‌తో ఏ వంటకం చేసినా.. అద్భుతంగా ఉంటుంది. ఇక క్యాప్సికమ్ ఆరోగ్యపరంగానూ బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
అయితే కొందరు మాత్రం క్యాప్సికమ్ తినేందుకు ఇష్టపడరు. కానీ, ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా క్యాప్సికమ్ ను తింటారు. క్యాప్సికమ్ లో విటమిన్ ఎ, సి మరియు ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను దరిచేరకుండా రక్షిస్తాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల.. షుగర్ కంట్రోల్ చేయడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.
బరువు అధికంగా ఉన్నవారు క్యాప్సికం తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. క్యాప్సికమ్ శరీరంలోని అదనపు కేలరీలను తగ్గించి, శరీరబరువును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది.అలాగే గుండె రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. క్యాప్సికమ్‌లో ఉండే ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్.. ఎలర్జీ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనాన్ని కల్గిస్తుంది.
అదేవిధంగా, క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. క్యాప్సికం రెగ్యులర్ గా తినడం వల్ల కంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్ల నుంచి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.