కరోనా టైమ్ లో పెరుగు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసా....?
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనా టైంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వైరస్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, కషాయం తీసుకునే వాళ్లు వైరస్ భారీన తక్కువగా పడుతున్నారు. ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని వైరస్ సోకకుండా తమను తాము రక్షించుకోవడానికి కృషి చేస్తున్నారు.
అయితే కరోనా సమయంలో పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగు ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియాను, రోగనిరోధక శక్తిని పెంచే జింక్ ను శరీరానికి అందిస్తుంది. పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. విటమిన్ సి, జింక్ ఉన్న ఆహారాలు తినడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. జింక్ సమృద్ధిగా ఉన్న పెరుగును మెనూ లిస్ట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు నిద్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
పెరుగు తింటే బరువు పెరుగుతామని, నిద్ర వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. నిపుణులు రోజుకు రెండుసార్లయినా పెరుగు తినడం వల్ల ఎంతో మంచిదని సూచిస్తున్నారు. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధనల్లో తేలింది.
పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా చేయడంతో పాటు శరీరానికి శరీరానికి కావాల్సిన విటమిన్ కె అందిస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తుంది. పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్స్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు సైతం దూరమవుతాయి.