భయంకరమైన జలుబు, జ్వరం, దగ్గును నిమిషాల్లో మాయం చేసే ఆయుర్వేద వైద్యం...?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. దగ్గు, జలుబు, జ్వరం కరోనా వైరస్ సోకిన వారిలో ఉండే ప్రధాన లక్షణాలు. దగ్గు, జలుబు, జ్వరం సాధారణ సమస్యలైనా ఈ వ్యాధులు మందులు వాడినా అంత త్వరగా నయం కావు. ఈ వ్యాధులకు మందుల కంటే కొన్ని ఆయుర్వేద వైద్యం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సులభంగా ఈ వ్యాధులను తగ్గించుకోవాలంటే మొదట ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీటిని తీసుకోవాలి. శుభ్రం చేసిన అల్లం ముక్కను తీసుకొని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ నీటిలో ఒక బిర్యానీ ఆకును కూడా వేయాలి. నాలుగు మిరియాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు మిక్సీలో వేసుకుని పొడిలాగా తయారు చేసుకోవాలి.
గ్రైండ్ అయిన యాలకులు, లవంగాలు, మిరియాల పొడిని నీటిలో యాడ్ చేయాలి. ఈ నీటిలో పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ను వేయాలి. ఆరు లేదా ఏడు తులసి ఆకులను ఈ నీటిలో యాడ్ చేయాలి. ఈ నీటిలో అర టీ స్పూన్ వామును కూడా తీసుకుని యాడ్ చేయాలి. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఈ నీటిలో యాడ్ చేసి ఈ నీటిని మరిగించాలి. నీరు మరిగే సమయంలో కొద్దిగా పసుపును నీటిలో యాడ్ చేయాలి. ఆ తరువాత గ్యాస్ ఆఫ్ చేసుకొని నీటిని తాగాలి.
ఈ నీటిని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు దూరమవుతాయి. అల్లంలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. గ్రైండ్ అయిన అల్లంను నీటిలో వేస్తే అందులోని ఔషధ గుణాలు మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి. లవంగాలు, మిరియాలు, యాలకులలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు దగ్గు, జలుబు, కఫంను తగ్గించడంలో సహాయపడతాయి.