క‌రోనా .. పేర్లు చెబితే జైలుకే..హెచ్చ‌రించిన జ‌గ‌న్‌..

Spyder

 

కరోనా బాధితుడి పేరు బయటకు చెబితే అరెస్టే అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్ర‌భుత్వం హెచ్చరిక‌లు జారీ చేశారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) బారిన పడ్డ వారి పేర్లు, వారి వివరాలను బహిర్గతపరచడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఈమేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటూ ఉత్త‌ర్వులు కూడా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ‘‘కోవిడ్ 19కు సంబంధించిన ఎలాంటి రహస్య సమాచారాన్ని (బాధితుడి వ్యక్తిగత సమాచారం, ల్యాబ్ రిపోర్టులు, మొదలైనవి) అయినా ప్రజలతో పంచుకోవడం పూర్తిగా నిషేధం. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. రహస్య సమాచారాన్ని ఇతరులకు చేరవేసే వారు ఎవరైనా కనిపిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిగా కోరుతున్నాం.’’ అని వైద్య, ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది.

వాస్త‌వానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల‌కు చెందిన వంద‌లాది మందిని క‌రోనా అనుమానిత కేసులుగా ప‌రిగ‌ణిస్తున్న అధికారులు వారిని క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. అయితే చుట్టూ ఉన్న స‌మాజంలోని కొంత‌మంది విప‌త్క‌ర ప‌రిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్లెదో చేయ‌రాని, చేయ‌కూడ‌ని ప‌నిచేసినందువ‌ల్లే వ్యాధి సోకిన‌ట్లుగా వాళ్ల‌కు వాళ్లే నిర్ధారించుకుని విష ప్ర‌చారం చేస్తుండ‌టంతో బాధితులతో పాటు వారి కుటుంబ‌స‌భ్యులు ఆత్మ‌నూన్య‌త భావంలోకి వెళ్తున్న‌ట్లుగా వైద్యులు గుర్తించార‌ట‌. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దృష్టికి యంత్రాంగం తీసుకెళ్ల‌డంతో సీరియ‌స్‌గా తీసుకున్నార‌ట‌. 

 

ఇక‌పై క‌రోనా అనుమానితుల పేర్లుగాని, పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారి వ్య‌క్తిగ‌త వివ‌రాలు గాని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని స్పష్టం చేశార‌ట‌. అలాగే  ఎవ‌రైనా వారి గౌర‌వానికి, ప‌రువు, మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించే విధంగా వ్య‌వ‌హ‌రించిన కేసులు న‌మోదు చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ కూడా ధ్రువీక‌రించ‌డం విశేషం. ఎవరైనా దీన్ని అతిక్రమించి కరోనా బాధితుల వివరాలు బహిర్గతపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవ‌స‌ర‌మైతే క్రిమిన‌ల్ కేసులు కూడా న‌మోదు చేస్తామ‌ని  హెచ్చరించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: