శరీరానికి చికెన్ తినడం వలన కలిగే ప్రయోజనాలివే...!

Reddy P Rajasekhar

మాంసాహారుల్లో ఎక్కువమంది చికెన్ ను ఇష్టపడతారన్న విషయం తెలిసిందే. చికెన్ తినడం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చికెన్ లో ఫ్రైడ్ చికెన్ కంటే ఉడికించిన చికెన్ వలన ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తాజా చికెన్ లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఉంటాయి. గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన చికెన్ ను తింటే కండర పుష్టి పొందవచ్చు. 
 
శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి చికెన్ లోని ప్రోటీన్లు ఎంతో సహాయపడతాయి. చికెన్ తినేవారిలో జీర్ణక్రియ పెరిగి ఆకలి కూడా పెరుగుతుంది. చికెన్ లో పాస్ఫరస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి బక్కగా ఉన్నవారి శరీరానికి బలాన్ని ఇచ్చి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఆయిల్ వేయకుండా వండిన చికెన్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. చికెన్ కొలెస్ట్రాల్ ను కలిగి ఉన్నప్పటికీ చికెన్ లో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ లెవెల్ ను తగ్గిస్తుంది. 
 
చికెన్ లో రోగనిరోధకశక్తిని పెంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. చికెన్ ను పెప్పర్ సూప్ లో ఉడికించి తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. సన్నగా, పీలగా ఉన్నవారు ప్రతిరోజు చికెన్ సూప్ తాగితే వారి శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. చికెన్ లో ఉండే అమైనో యాసిడ్స్ పిల్లలు ఎత్తు పెరగటానికి సహాయపడతాయి. చికెన్ తినేవారిలో చికెన్ లో ఉండే సెలీనియం వలన కీళ్ల నొప్పులు తక్కువగా వస్తాయి. 
 
ఒత్తిడిలో ఉన్నవారు గ్రిల్డ్ చికెన్ ను తింటే చికెన్ లో ఉండే ఫాంటోథెనిక్ యాసిడ్ ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటంతో ఒత్తిడి తగ్గుతుంది. చికెన్ లో ఉండే బీ6 విటమిన్ గుండెనొప్పికి కారణమైన హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది. మహిళలు చికెన్ రుతు క్రమ సమయంలో తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: