పాప్ కార్న్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Reddy P Rajasekhar

సాధారణంగా పాప్ కార్న్ ను ఎక్కువగా సినిమా థియేటర్లకు వెళ్లినపుడు లేదా ఇంట్లో టీవీ చూసే సమయంలో తింటూ ఉంటాం. పాప్ కార్న్ తినటం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బయట కొనుగోలు చేసిన పాప్ కార్న్ కన్నా ఇంట్లో మొక్కజొన్నతో తయారు చేసుకున్న పాప్ కార్న్ శరీరానికి ఎంతో మంచిది. మొక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్ తయారవుతుంది. 
 
నూనెలో మొక్కజొన్న గుజ్జును వేడి చేసినప్పుడు అది పాప్ కార్న్ గా మారుతుంది. పాప్ కార్న్ లో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ ఉంటాయి. పాప్ కార్న్ శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పాప్ కార్న్ లో జీర్ణ క్రియకు సహాయపడే అన్ని రకాల ఫైబర్లు ఉంటాయి. పాప్ కార్న్ మల బద్ధకాన్ని నిరోధించటంతో పాటు ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. 
 
పాప్ కార్న్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. క్యాన్సర్ ను నిరోధించటంలో కూడా పాప్ కార్న్ సహాయపడుతుంది. పాప్ కార్న్ వృద్ధాప్య ఛాయలను నిరోధించటంతో పాటు రక్త హీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గించటంతో పాటు ఎముకల్లో ధృఢత్వాన్ని పెంచటానికి పాప్ కార్న్ సహాయపడుతుంది. పాప్ కార్న్ ఎక్కువగా తినే వారిలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. మధుమేహ రోగులకు పాప్ కార్న్ ఎంతో ఆరోగ్యకరమైనది. 
 
పాప్ కార్న్ ఎక్కువగా తినేవారికి మలబద్ధకం, మొలలు లాంటి వ్యాధులు రావు. పాప్ కార్న్ తినేవారి కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు పాప్ కార్న్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: